వ్యవసాయ బావిలో పడి ట్రాక్టర్ బోల్తా

మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులోని రఘావపేట్ గ్రామానికి వెళ్ళేదారిలో ట్రాక్టర్ అదుపుతప్పి వ్యవసాయ భావిలో పడి ట్రాక్టర్ భోల్తా పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చేందిన గోపిడి రాజేష్ తన స్వంత ట్రాక్టర్‌ను తమ వ్యవసాయ పోలం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని వాగు బ్రిడ్జి వద్ద అదుపు తప్పి వ్యవసాయ భావిలో పడి పోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో రాజేష్‌కు ఏలాంటి గాయాలు ప్రమాదం జరుగలేదని, బావిలో పడిన ట్రాక్టర్‌ను జెసిబి సాయంతో బయటకు తీసినట్లు గ్రామస్థులు తెలిపారు.
Tags: Dropping, tractor, well Timmapur village