Take a fresh look at your lifestyle.

తెలంగాణ అన్ని గ్రామాల్లో పైప్ లైన్ ద్వారా తాగు నీరు

  • గోవా, అండమాన్ మరియు నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా..
  • దేశ వ్యాప్తంగా 67.49 శాతం
  • పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ప్రకటన

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: తెలంగాణలో మొత్తం అన్ని గ్రామాలకు ‘పైప్డ్ డ్రింకింగ్ వాట‌ర్’ అందుతోంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం పార్లమెంటుకు తెలిపింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు ఏ రాష్ట్రంలో ఎంత శాతం పైప్డ్ డ్రింకింగ్ వాటర్ అందుతోందో పూర్తి వివ‌రాలు తెలపాలని రాజ్యసభలో బీజేపీ పార్టీ ఎంపీ ప్రసన్న కుమార్ ఆచార్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి ర‌త‌న్ లాల్ ఖ‌టారియా లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడి చేసారు. దేశవ్యాప్తంగా 67.49 శాతం గ్రామీణ ప్రజలకు ‘పైప్డ్ డ్రింకింగ్ వాటర్’ అందుతున్నట్టు కేంద్రం వెల్ల‌డించింది.

2024 సంవత్సరం వరకు తల పెట్టిన జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీరు అందించాలని రాష్ట్రాలతో కలిసి కేంద్రం పని చేస్తున్నట్టు కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి ర‌త‌న్ లాల్ ఖ‌టారియా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్లకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ‘పైప్డ్ డ్రింకింగ్ వాటర్’ అందిస్తున్నట్లుఆయన వెల్ల‌డించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 99 శాతం ఈ పధకం కింద న‌మోదు పూర్తీ అయిందని. ఏపీలో 3.81 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సిస్తుండ‌గా, అందులో 3.74 కోట్ల మందికి పైపుల ద్వారా నీటి వ‌స‌తి ప్ర‌తి ఇంటికి అందుతున్న‌ట్టు కేంద్రం తెలిపింది.

గోవా, అండమాన్ & నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా 100% గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ‘పైప్డ్ డ్రింకింగ్ వాటర్’ అందుతున్న‌ట్టు కేంద్రం స్ప‌ష్టం చేసింది. తెలంగాణ కంటే ముందే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పధకాన్ని అమ‌లు చేసిన గుజ‌రాత్ రాష్ట్రంలో ఇప్పటికీ 97 శాత‌మే ఈ పధకం కింద న‌మోదు పూర్తీ అయినది.

Leave a Reply