అంజిబాక గ్రామంలో గత కొన్నేళ్లుగా మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నా పంచాయితీ అధికారులు మాత్రం పట్టించు కోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు ఉన్నా నిరుపయోగంగా తయారైందని గత ఐదేళ్లు ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునే వారు లేక మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
విద్యుత్ మీటరు, మోటారుకు చెందిన పీజు బాక్సున తాడి చెట్టుకు వేలాడ దీశారు అంటే గ్రామస్తులకు మంచినీరు అందించే విషయంలో పంచాయితీ అధికారుల నిర్లక్షం ఏ మేర ఉందో అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎంపిటిసి గుంపుకు అసలు పైపు లైన్ ఏర్పాటు చేయకుండా వదిలి వేశారని వెంటనే పంచాయితీ అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.