కన్నడ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
వీడియో సందేశం విడుదల
న్యూదిల్లీ,మే9 : కన్నడ ప్రజల కలలను తన సొంత కలలుగా భావించి, వారి కలలను సాకారం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఈనెల 10న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరాగా పార్టీలు సాగించిన ప్రచారం ముగిసిన నేపథ్యంలో కన్నడ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు. బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్టయింది. కలలే నా కలలు. తీర్మానమే నా తీర్మానం అని మోదీ ఆ వీడియోలో స్పష్టం చేశారు. కలలు సాకారం చేస్తా.. అంటూ కన్నడ ప్రజలకు మోదీ బహిరంగ విజ్ఞప్తి చేశారు. కర్ణాటకను రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలపాలంటే ఈనెల 10న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన పౌరులుగా ఓటు వేయాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ ఆర్థికవ్యవస్థలో కర్ణాటక ప్రాధాన్యతను వివరిస్తూ, భారతదేశం ఇండియాలోనే అది పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదవ స్థానంలో ఉందని, త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. కర్ణాటక ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిని వృద్ధి చెందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పారు.
కర్ణాటకలోని మూడున్నరేళ్ల డబుల్ ఇంజన్ ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమని అన్నారు. కోవిడ్ సమయంలోనూ కర్ణాటక బీజేపీ నాయకత్వంలో ఏడాదిలో 90 వేల కోట్ల పెట్టుబడులను చూశామని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కర్ణాటకలో విదేశీ పెట్టుబడులు ఏడాదికి 30 వేల కోట్ల మేరకు మాత్రమే వచ్చేవని అన్నారు. కర్ణాటక యువత పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనమని అన్నారు. కర్ణాటక రాష్టాభ్రివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని మోదీ పునరుద్ఘాటించారు. సిటీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం, గ్రామాలు, సిటీల్లో జీవనప్రమాణాలు మెరుగుపరచడం, మహిళలు, యువకులకు కొత్త అవకాశాల కల్పనకు బీజేపీ ప్రభుత్వం అత్యంత విధేయతతో పనిచేస్తుందని హా ఇచ్చారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్నొవేషన్‌లో కర్ణాటకను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్దిదిద్దాలని తాము కోరుకుంటున్నట్టు ప్రధాని చెప్పారు. విద్య, ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో కర్ణాటకను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని, వ్యవసాయరంగంలోనూ రాష్టాన్ని్ర మొదటి స్థానంలో నిలిపరేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, కర్ణాటక సంస్క•తి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. కకర్ణాటకలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్- సెక్యులర్ మధ్య పోటీ ఉంది. 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి ఈనెల 10న పోలింగ్ జరుగనుండగా, 13న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. 113 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.