Take a fresh look at your lifestyle.

సర్వోన్నత పదవిలో గిరిపుత్రి…

‘‘ఒడిషా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం నుండి సంతాల్‌ ‌గిరిజన తెగకు చెందిన వ్యక్తి, ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ఆ పదవి వరించిన తొలి ఆదివాసీ బిడ్డగా చరిత్ర సృష్టించారు. దేశ మొదటి పౌరురాలి స్థాయికి చేరుకోవడం  యావత్‌ ‌భారత దేశం గర్వించదగిన విషయం…’’

భారత దేశ చరిత్రలో  ద్రౌపది ముర్ము  సరికొత్త అధ్యాయం….

ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్‌ ‌జిల్లాకు చెందిన బైదాపోసి గ్రామంలో గిరిజన జాతికి చెందిన సంతాల్‌ ‌కుటుంబంలో 1958 జూన్‌ 20 ‌న జన్మించింది. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్‌ ‌తుడు. వారి  తండ్రి, తాత లు పంజాయితీరాజ్‌ ‌వ్యవస్థలోని గ్రామాధికార్లుగా ఉండేవారు.ద్రౌపది ముర్ము భువనేశ్వర్‌ ‌లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసి ఆ తర్వాత ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, రాష్ట్ర రాజకీయాల్లోకి రాకముందు ముర్ము స్కూల్‌ ‌టీచర్‌గా తన ప్రస్తావన ప్రారంభం  అయింది. 1977-83 మధ్య ఒడిశాలోని నీటిపారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ ‌గా, 1994 నుంచి 97 వరకూ శ్రీ అరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ అం‌డ్‌ ‌రీసెర్చ్ ‌సెంటర్‌లో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేసింది.
ఒక భారతీయ రాజకీయవేత్త, జార?ండ్‌ ‌తొమ్మిదవ గవర్నర్‌గా సేవలందించారు.  భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. జార?ండ్‌ 2000 ‌సంవత్సరంలో ఏర్పడినప్పటి నుండి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని (2015-2021) పూర్తి చేసిన జార?ండ్‌ ‌మొదటి గవర్నర్‌. ‌వారిని  చీణ• కూటమి నుండి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది….ద్రౌపది ముర్ము 1997లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాయ్‌రంగపూర్‌ ‌నగర పంచాయితీ కౌన్సిలర్‌గా ఎన్నికైంది. ఆమె భారతీయ జనతా పార్టీ కి చెందిన గిరిజన తెగల మోర్చా కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలను అందించింది. ఆ తర్వాత 2000వ జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రాయరంగపూర్‌ ‌నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై బిజూ జనతాదళ్‌ ‌సంకీర్ణ ప్రభుత్వంలో 2000 మార్చి 6 నుండి 2002 ఆగస్టు 6 వరకు వాణిజ్యం, రవాణాకు స్వతంత్ర బాధ్యతతో, 2002 ఆగష్టు 6 నుండి మే 2002 వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధికి శాఖ మంత్రిగా పని చేసింది. ద్రౌపది ముర్ముకు 2007లో ఒడిశా శాసనసభ ఉత్తమ శాసనసభ్యురాలిగా నికంఠ పురస్కారాన్ని అందించింది.
ఒడిషా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం నుండి సంతాల్‌ ‌గిరిజన తెగకు చెందిన వ్యక్తి, ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ఆ పదవి వరించిన తొలి ఆదివాసీ బిడ్డగా చరిత్ర సృష్టించారు. దేశ మొదటి పౌరురాలి స్థాయికి చేరుకోవడం  యావత్‌ ‌భారత దేశం గర్వించదగిన విషయం…ద్రౌపది ముర్ము జార?ండ్‌  ‌మొదటి మహిళా గవర్నర్‌, ఒడిశా నుండి భారతదేశంలోని ఒక రాష్ట్రంలో గవర్నర్‌గా నియమితులైన మొదటి మహిళ, గిరిజన నాయకురాలు.రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు కావాల్సిన మ్యాజిక్‌ ‌నెంబర్‌ ఓట్లను ఆమె సాధించారు. రాష్ట్రపతి అయ్యేందుకు కావాల్సిన ఓట్ల విలువ 5,28,491 కాగా ద్రౌపది ముర్ముకు తొలి ప్రాధాన్యతా ఓట్లు 2824 వచ్చాయి. వీటి విలువ 6,76,803. మరోవైపు విపక్షాల అభ్యర్ధి యశ్వంత్‌ ‌సిన్హా కు మూడో రౌండ్‌ ‌ముగిసేసరికి 1058 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 2,61, 062. ద్రౌపది ముర్ముకు వచ్చిన తొలి ప్రాధాన్యతా ఓట్లను బట్టి ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ ‌పీసీ మోడీ వెల్లడించారు. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్‌ ‌కూడా అందజేశారు.
ప్రపంచదేశాల్లో ద్రౌపది ముర్ము భారత్‌ ‌ఖ్యాతిని మరింతగా వ్యాప్తి చేస్తారు,  అని ఆశిస్తూ. 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధి వారు, ఒక జాతికి, ఒక మతానికి చెందినదిగా అభివర్ణించ్చావొద్దు, అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి చేరుకున్న గొప్పతనాన్ని గుర్తించాలి..రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించడంతో…  యావత్‌  ‌భారత దేశం. ఒడిశాలోని వారి స్వగ్రామంలోని పండగ వాతావరణం నెలకొంది. ఊరి ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు.ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సమయంలో  ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి పదవికి ఎన్నికైంది.  భారత రాష్ట్రపతి పీఠంపై కూర్చోబోతున్న రెండో మహిళగా, తొలి ఆదివాసిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా పై విజయం సాధించిన వారు.. జులై 26న 15వ  రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో  ప్రమాణస్వీకారం చేయనున్నారు..
image.png
జాజుల దినేష్‌, ఎంఏ. (ఏంఎడ్‌,) ‌సెట్‌,  
9666238266.

Leave a Reply