- మాస్కులు అడిగిన పాపానికి చిత్రహింసలకు గురి చేశారు
- జగన్ దళిత వ్యతిరేక చర్యలకు డాక్టర్ బలయ్యారు
- తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, అచ్చన్నాయుడు తదితరులు
అమరావతి,: నర్సీపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని టీడీపీ విమర్శించింది. డాక్టర్ సుధాకర్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడునారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు సుధాకర్ బలయ్యారని అన్నారు. మాస్కులు అడిగిన పాపానికి శారీరకంగా, మానసికంగా వేధించి సుధాకర్‌ను జగన్ ప్రభుత్వం బలిగొందని విమర్శించారు. సుధాకర్ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మానసికంగా వేధించి సుధాకర్‌ను చంపారని ఆరోపించారు. నడిరోడ్డు ద బట్టలు తీసి, డాక్టర్ సుధాకర్‌ను జగన్ ప్రభుత్వం వేధించిందన్నారు.
జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక చర్యలకు ఒక డాక్టర్ బలైయ్యాడన్నారు. దళిత డాక్టర్ మృతికి కారణమైన జగన్మోహన్ రెడ్డి ఇంతకింత అనుభవించే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. జగన్ ప్రభుత్వం మానసికంగా వేధించడంతోనే డాక్టర్ సుధాకర్ మృతి చెందారని ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి, అన్ని విధాల ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుధాకర్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధాకర్ మృతికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ప్రాణాలు తీశారన్నారు. వైద్యుడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
ముఖ్యమంత్రికి కక్షలు కార్పణ్యాలు తప్ప.. ప్రాణం విలువ తెలియదన్నారు. జగన్ రెడ్డి మూర్ఖత్వమే సుధాకర్ మరణానికి కారణమని ఆరోపించారు. మానసికంగా హింసించి మనోవేధనతో చనిపోయేలా చేశారన్నారు. సుధాకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని… కుటుంబ సభ్యులకు జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు సకాలంలో పూర్తయితే డాక్టర్ సుధాకర్ ప్రాణం పోయేది కాదని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. శనివారం ఆయన డియాతో మాట్లాడుతూ.. డాక్టర్ సుధాకర్ మరణానికి సీఎం జగన్ రెడ్డి ఉన్మాద మనస్తత్వమే కారణమన్నారు. సుధాకర్‌ది సర్కారు హత్యే అన్నారు. ఏడాది కాలంగా బెదిరింపులు, వేధింపులతో మానసికంగా హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిని హింసించడమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని వర్ల రామయ్య అన్నారు.
దళితులకు ప్రశ్నించే హక్కు లేదన్నట్లు వరుస ఘటనలు, ఓట్లేసి గెలిపించినందుకు అక్రమ కేసులు, శిరో ముండనాలే బహుమానాలా? అని ప్రశ్నించారు. సుధాకర్ లాంటి దళితులు ఇంకా ఎంత మంది ప్రభుత్వ అరాచకాలకు బలవ్వాలి? అని నిలదీశారు. సుధాకర్ మరణానికి ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్‌ది ప్రభుత్వ హత్యే అని టీడీపీ ఎస్సీ సెల్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ ఆరోపించారు. పిచ్చివాడిగా ముద్ర వేసి ఒంటరిని చేశారని విమర్శించారు..ప్రశ్నించిన పాపానికి ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. డాక్టర్ సుధాకర్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం చిత్రహింసలు చేస్తోందని మండిపడ్డారు. దళితులపై దాడులు, హత్యలు ఎక్కువయ్యాయన్నారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదా…ప్రశ్నించినందుకు ఎంపీని రే హింసిస్తున్నారు… ప్రశ్నించిన వారిని కుంగిపోయేలా చేసి చనిపోవడానికి ప్రభుత్వం కారణమవుతోంది..సుధాకర్ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి‘ అని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.