Take a fresh look at your lifestyle.

చేనేతను ఆదుకోవడంలో పాలక ప్రభుత్వాలు విఫలం

  • మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు 
  • సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు

కరోనా లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్సీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం భూదాన్‌ ‌పోచంపల్లి పురపాలక కేంద్రంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తి పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న చేనేత కుటుంబాలు లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా అధ్వానంగా మారాయని, జివో నెంబర్‌ 45‌ను తక్షణమే రద్దు చేసి చేనేత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బడుగు శంకరయ్య, కోడె బాల నర్సింహ,చేనేత జన సమాక్య రాష్ట్ర అధ్యక్షులు చింతకింది రమేష్‌, ‌చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు మంగళపల్లి శ్రీహరి, సంఘం చంద్రయ్య, కర్నాటి పురుషోత్తం, ఏలే బిక్షపతి, సీత కృష్ణ, కటకం శ్యాంసుందర్‌, ‌నరహరి, రుద్ర శ్రీశైలం, మిర్యాల వెంకటేష్‌, ‌కూరపాటి భాస్కర్‌, ‌రామకృష్ణ ,బొడ దయానంద్‌, ‌రుద్ర నరసింహ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!