Take a fresh look at your lifestyle.

డా.పొత్తూరి వెంకటేశ్వర రావు ఇక లేరు..!!

పత్రికా రంగంతో సుదీర్ఘ కాలం అనుబంధం..వివిధ పత్రికల్లో సంపాదకీయ బాధ్యతలు నిర్వహించిన డా.పొత్తూరి వెంకటేశ్వర రావు ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు.గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతున్నారు.ఐఎఎస్ అధికారి శంకరన్ తో కలిసి ‘ సిటిజన్స్ కంసర్న్ ‘ ద్వార

వివిధ సామజిక సమస్యల పై పోరాడుతూ..బాధితులకు అండగా నిలిచారు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో   ప్రెస్ అకాడమీ చైర్మన్ గా విధులు నిర్వహించారు.’ప్రజాతంత్ర ‘ శ్రేయోభిలాషులు పొత్తూరి వెంకటేశ్వర రావు కార్టునిస్ట్ ఆలురి సత్యం తో కలిసి 50 వారాలు ‘కాసులయ్య సుద్దులు’శీర్షిక నిర్వహించారు.వారి ఆత్మకు శాంతి కలుగాలని బాధా తప్త  హృదయం తో నివాళులు అర్పిస్తుంది.

Leave a Reply