Take a fresh look at your lifestyle.

మోదీ…నేనూ అదే చెబుతున్నా.. దుబ్బాకలో టిఆర్‌ఎస్‌ ‌గెలిస్తేనే డబుల్‌ ఇం‌జన్‌ ‌గ్రోత్‌

తొగుట మండల ఎన్నికల ప్రచార సభలో మంత్రి హరీష్‌రావు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్‌ ఎన్నికల్లో డబుల్‌ ఇం‌జన్‌ ‌గ్రోత్‌(‌మరింత రెట్టింపు పెరుగుదల) అంటున్నాడు. అంటే, బిహార్‌లో బిజెపి…ఢిల్లీలో బిజెపి ఉంటే డబుల్‌ ‌డబుల్‌ ఇం‌జన్‌ ‌గ్రోత్‌ ఉం‌టుందని చెబుతున్నారనీ…నేనూ అదే చెబుతున్నా. ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలో ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెలిస్తేనే డబుల్‌ ‌గ్రోత్‌ ఉం‌టుందని చెబుతున్నాననీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం దుబ్బాక టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత-రామలింగారెడ్డికి మద్దతుగా తొగుట మండలంలోని ఘణపూర్‌, ‌గుడికందుల గ్రామాలలో తొగుట మండల ఎన్నికల ఇంఛార్జి, ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, ‌డిసిసిబి ఛైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం, రోడ్‌ ‌షోలో పాల్గొన్నారు.
అంతకుముందు గ్రామంలోని కాలబైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… తెలంగాణలో నైజాం పాలన నుంచి సమైక్యాంధ్ర పాలన వరకు భూమి శిస్తు వసూలు చేశారనీ, కానీ, కేసీఆర్‌ ‌మాత్రం భూమి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు పథకం ద్వారా డబ్బులిచ్చి చరిత్ర తిరగరాశారన్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మాత్రమే అని తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ ఇవ్వడం లేదనీ,  గతంలో వోట్ల కోసం లీడర్లు గ్రామాలకు వస్తే మహిళలు ఖాళీ నీటి బిందెలతో నిరసన తెలిపి తాగునీటి కోసం ప్రశ్నించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇం‌టింటికీ మంచినీరు అందిస్తున్నారని తెలిపారు.  తెలంగాణ రాక ముందు  రైతుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉండేదనీ,   కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీల పాలనలో రైతుల ఆత్మహత్యలే మిగిలాయన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply