ఓ దిన పత్రికలో ప్రచురించిన “దొంగల తో దోస్తీ” అనే ఆర్టికల్, దుర్మార్గపు చర్య అని, పూర్తిగా అబద్ధం అసత్యమనీ, సైబరాబాద్ సిపి సజ్జనార్ కొట్టిపారేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓ దినపత్రిక ప్రచురించిన కథనంలో వాస్తవం లేదని, తెలంగాణ పోలీసు వ్యవస్థను దెబ్బ తీసే విధంగా ఉన్నదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అన్ని విధాలుగా ఆదరిస్తున్నదని, నేరాలను అరికట్టడములో తెలంగాణ పోలీస్ వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు.
పోలీసు సిబ్బంది నిత్యం ప్రజల కోసం సమాజం కోసం పాటు పాడుతుంటే, ఇలా రాయడం సరికాదని అన్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ ప్రజల కోసం 24 గంటలు కష్టపడుతుందని, అందుకోసమే, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, వివిధ నేరాలను అరికట్టడంలో పోలీస్ వ్యవస్థ నిరంతరం పని చేస్తున్నదని తెలిపారు.