Take a fresh look at your lifestyle.

కరోనాతో ఆందోళన వద్దు: మంత్రి పువ్వాడ

ఖమ్మం, మే 27 ప్రజాతంత్ర(ప్రతినిధి): రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు రోజు రోజుకు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యం లో జిల్లాలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని జిల్లా యంత్రాంగం పూర్తిగా అదుపులో ఉంచుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. మాస్కులు అందరికి అందుబాటులో ఉండేలా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, ఆర్టీసి బస్‌ ‌స్టాండ్‌ ‌గాంధీచౌక్‌ ‌ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ‘‘మాస్క్ ‌కేంద్రాలను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యవసరంగా బయటకు వచ్చే సమయంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ‌ధరించాలని మంత్రి అన్నారు.

జన సంచారం ఎక్కువ గా ఉండే ప్రాంతాలలో అందరికి మాస్క్‌లు అందుబాటులో ఉంచేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. కరోనా వైరస్‌ ‌బారిన పడకుండా ఉండేందుకు నియంత్రణ చర్యలు పాటించాలని పరిశుభ్రత పాటించి తరచుగా చేతులను శానిటైజ్‌ ‌చేసుకుంటు భౌతిక దూరం పాటించి, బయటకు వచ్చే సమయంలో మాస్కులు ధరించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని నియంత్రించగలుగుతామని మంత్రి తెలిపారు. నగర మేయర్‌ ‌డా••పాపాలాల్‌, ‌జిల్లా కలెక్టర్‌ ఆర్‌.‌వి.కర్ణన్‌, ‌నగరపాలక సంస్థ కమీషనర్‌ అనురాగ్‌ ‌జయంతి, అసిస్టెంట్‌ ‌కలెక్టర్‌ ఆదర్శ సురభి, కార్పోరేటర్లు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply