సూర్యాపేట, ఏప్రిల్ 29, ప్రజాతం త్ర ప్రతినిధి): జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెంద వొద్దని, ఇంకా కొన్ని రోజుల్లో అం తా సద్దుమనుగుతుందని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం పెన్‌పహాడ్ మండలంలోని అనంతారం కంటై న్మెంట్ ప్రాంతాన్ని ఆర్డిఓ మోహ న్రావులతో కలిసి సందర్శించి మాట్లాడారు. సూర్యాపేటలో కరో నా పాజిటివ్ కేసులతో సంబంధం ఉన్న అనంతారం మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ఆమెతో ప్రాథమిక సంబంధం ఉన్న 43మందిని సత్వరమే సూర్యాపేటకు పంపించి పరీక్షలు చేయగా వారికి కరోనా నెగెటివ్‌గా నిర్థారణ అయిందని దీంతో వారిని హ•మ్ క్వారంటైన్లలో ఉంచినట్లు గుర్తుచేశారు. ప్రతి రోజు అధికారు లతో పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నామని, ప్రజలు ఎవరు బయ టకు రావొద్దని, కరోనా వ్యాధికి మందు లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ విధిగా స్వీయ నిర్భందం ఉండాలని అదే ఒక్కటే ప్రస్తుతానికి కరోనా నివారణకు మార్గమని సూచించారు. గ్రామంలో నియమించిన అధికారులు జరుగుతున్న పారిశుద్ద్య పనులు, హైడ్రోక్లోరైడ్ ద్రావణ పిచికారి, ఆరోగ్య సర్వే వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలను అందజేయాలని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ వెంకన్న, జెడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, ఎంపిటిసి మామిడి రేవతి పరందాములు, ఆరై కృష్ణారెడ్డి, సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం, నర్సరీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం పెన్‌పహాడ్ మండలంలోని దోసపహాడ్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం నిలువలను పరిశీలించారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించా లని, అలాగే అకాల వర్షం పడు తున్నందున ముందస్తు జాగ్రత్తగా అన్ని చర్యలు నిర్వహకులు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలో రైతులు, హమాలీలు, సిబ్బంది సామాజిక దూరం పాటించేలా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ తప్పక మాస్క్‌లను వేసుకోవాలని తెలిపారు. రైతులు కాంటాలు వేసిన ధాన్యం తరలిం పుకు లారీలు రావడంలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో లారీలు వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానికంగా ఉన్న నర్సరీని సందర్శించారు. ఎండ కాలం కావున మొక్కలను ఎండ తీవ్రత నుండి రక్షించడా నికి తగు జాగ్రత్తలు తీసుకోవాల ని నిర్వహకులకు సూచించారు.