Take a fresh look at your lifestyle.

రైళ్లు ఇప్పుడే వద్దు

  • రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్‌ ‌చేయండి, ఎఫ్‌•ఆర్‌బిఎం పరిమితి పెంచండి
  • వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు మంచి నిర్ణయం

కొరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలలో భాగంగా దేశంలో నిలిపివేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని సీఎం కేసీఆర్‌ ‌ప్రధాని నర్రేద మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్‌ ‌చేయాలనీ, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంచాలనీ, ఏ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను ఆ రాష్ట్రం అనుమతించాలని సూచించారు. జూలై ఆగస్టు మాసాల్లోనే కొరోనా వ్యాక్సిన్‌ ‌వచ్చే అవకాశం ఉందనీ, అది కూడా భారత్‌ ‌నుంచి మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నుంచే వచ్చే అవకాశం ఉందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సోమవారం దిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల సీఎం)తో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఆయా రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, భవిష్యత్తులో కొరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని సీఎంల నుంచి సలహాలు, సూచలను స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కొరోనా ప్రభావం ఉందన్నారు. కాబట్టి అప్పుడే ప్రయాణికుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయనీ, దీంతో ఎవరు ఎటు పోతున్నారో తెలియక వారిలో ఎంత మందికి కొరోనా ఉందో తెలియక ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. అందరికీ టెస్టులు చేయడం కుదరదనీ, రైళ్లలో వచ్చిన ప్రయాణికులందరినీ క్వారంటైన్‌ ‌చేయడం కూడా కష్టమైన పని అని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఇప్పుడే ప్రయాణికుల రైళ్లను నడిపించకపోవడం మంచిదని సూచించారు. కొరోనో ఇప్పుడిప్పుడే మనల్ని వదిలి పోయేలా కనిపించడం లేదనీ, కాబట్టి కొరోనాతో కలసి బతకడం తప్పదని అనిపిస్తోందనీ, అందువల్ల ముందుగా ప్రజలలో భయాన్ని పొగొట్టి కొరోనాతో కలసి బతకడం నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. కొరోనా వ్యాక్సిన్‌ ‌తయారు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, భారత దేశం నుంచే వ్యాక్సిన్‌ ‌వచ్చే అవకాశం ఉందనీ, ముఖ్యంగా ఈ దిశగా హైదరాబాద్‌కు చెందిన కంపెనీలు బాగా కృషి చేస్తున్నాయనీ, జూలై ఆగస్టు నెలలో కొరోనా వ్కాక్సిన్‌ అం‌దుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

in of various states. Telangana involved CM KCR, Ministers, CS, DGP and others
వివిధ రాష్ట్రాల సిఎంలతో వీడియో కాన్ఫరెర్స్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ. పాల్గొన్న తెలంగాణ సిఎం కేసీఆర్‌, ‌మంత్రులు, సిఎస్‌, ‌డిజిపి తదితరులు

కొరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందనీ, మందులు, మాస్కులు, పీపీఈ కిట్లు, ఇలా కావల్సినవన్నీ సమకూర్చుకున్నట్లు సీఎం ప్రధానికి వివరించారు. కొరోనా వల్ల ఆర్థిక సంవత్సరంపై భారం పడిందనీ, ఆదాయాలు లేవనీ, అప్పులు కట్టే పరిస్థితి ఏ రాష్ట్రానికీ లేదనీ, అందువల్ల అన్ని రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్‌ ‌చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రైతుల రుణాలను ఎలాగైతే బ్యాంకులు రీషెడ్యూల్‌ ‌చేస్తాయో అలాగే, రాష్ట్రాల రుణాలను రీ షెడ్యూల్‌ ‌చేసే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు రాష్ట్రాల ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచాలని ప్రధానికి సీఎం ప్రత్కేకంగా విజ్ఞప్తి చేశారు. వలస కార్మికుల విషయంలో అన్ని రాష్ల్రాలు సానుభూతితో వ్యవహరించాలనీ, సొంతూళ్లలో పిల్లలు, తల్లిదండ్రులను వదిలి వచ్చిన వారంతా తమ సొంత రాష్ట్రాలకు వెళదామని ప్రయత్నిస్తున్నందువల్ల వారిని వెళ్లనివ్వని పక్షంలో అనవసర ఆందోళన తలెత్తుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ ‌రైళ్లను వేయడం మంచి నిర్ణయమని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్లాలని అనుకుంటున్న వారిని కూడా పంపుతున్నామనీ, రాష్ట్రంలోని రైస్‌ ‌మిల్లులలో పనిచేసే బీహార్‌ ‌కార్మికులు ప్రత్యేక రైలు ద్వారా మళ్లీ తెలంగాణకు వచ్చారని తెలిపారు. వారిని తాము సాదరంగా ఆహ్మానిస్తామనీ, ఆయా రాష్ట్రాలకు వచ్చే వారిని రానివ్వడంతో పాటు వెళ్లే వారిని వెళ్లనివ్వాలనీ, అయితే, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కంటైన్మెంట్‌ ‌జోన్లలో నిబంధనలు కచ్చితంగా పాటించాలనీ, పాజిటివ్‌, ‌యాక్టివ్‌ ‌కేసలు లేని జిల్లాలను ఆరెంజ్‌, ‌గ్రీన్‌జోన్లుగా మార్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలా ప్రకటించడంలో జాప్యం జరుగుతున్నదనీ, పాజిటివ్‌ ‌కేసులు లేని ప్రాంతాలలో ఇతర కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యమవుతుంది కాబట్టి, రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు రాగానే వెంటనే మార్చాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply