Take a fresh look at your lifestyle.

బస్సులపై నా ఫోటో వేయొద్దు సీఎం కేసీఆర్‌ ఆదేశం

Don't put my photo on buses CM KCR

సరుకు రవాణా చేసే ఆర్టీసీ కార్గో బస్సులపై తన ఫోటో వాడవద్దని సీఎం కేసీఆర్‌ ఆ ‌శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలో సరుకులను రవాణా చేసేందుకు కార్గో బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బస్సులపై సీఎం కేసీఆర్‌ ‌ఫోటో వాడాలని అధికారులు యోచిస్తున్నట్లు మీడియాలో విస్త•తంగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన కేసీఆర్‌ ఆ ‌ప్రయత్నాలను విరమించుకోవాలని ఆదేశించారు. ఈమేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌ అభిప్రాయంతో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి పి.రాజశేఖరరెడ్డి ఆర్టీసీ ఎండీకి నోట్‌ ‌పంపారు.

కార్గో సర్వీసుల ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో పయనించాలన్నదే తపన అని పేర్కొన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదనీ, ఈ ప్రతిపాదన తనకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల ద్వారా ప్రజలకు సేవలు అందించడమే తన లక్ష్యమనీ, అంతేకాని చౌకబారు ప్రచారం పొందడం తన అభిమతం కాదని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply