Take a fresh look at your lifestyle.

‘‌మాకేమవుతుందన్న నిర్లక్ష్యం వొద్దు’ కొరోనా వ్యాపించొద్దంటే జనం గూమికూడొద్దు

నిరుపేదలకు నిత్యావసర వస్తువుల కిట్స్ ‌పంపిణీలో మంత్రి హరీష్‌రావు

యావత్‌ ‌ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా మహమ్మారికి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్స్, ‌మందులు కనిపెట్టలేదనీ, కొరోనాపై ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది ప్రాణానికే ముప్పువాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు కొరోనాకు ఎలాంటి కరుణ లేనందునా…ఈ వ్యాధిపై ఎవరు కూడా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని కొండా భూదేవి గార్డెన్స్‌లో నియోజకవర్గ పరిధిలోని దేవాలయాల అర్చకులు, చర్చిల్లో ప్రార్థనలు జరిపే ఫాస్టర్స్, ‌మసీదుల్లో ప్రార్థనలు జరిపే ఇమామ్‌, ‌మౌజమ్‌లకు రాష్ట్ర ఆహార సంస్థ కమిషన్‌ ‌సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌, ‌ప్రముఖ పారిశ్రామికవేత్త కిషోర్‌బాబుతో కలిసి మొత్తం 160 మంది పేదలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. కండ మల్లయ్య గార్డెన్స్‌లో పట్టణ పరిధిలోని 90 మంది రజకులు, 160 మంది బస్సు డ్రైవర్లు, 30 మంది స్ప్రే పెయింటర్ల కుటుంబాలకు మొత్తం 280 మంది కుటుంబాలకు మంత్రి చేతుల మీదుగా నిత్యావసర సరుకుల కిట్స్ ‌పంపిణీ చేశారు. అదే విధంగా శివమ్స్ ‌గార్డెన్స్‌లో చిందు, యక్షగాన కళాకారులు, 1వ వార్డు నిరుపేదలకు, శివానుభవ మండపంలో ముత్తూట్‌, ‌లయన్స్ ‌క్లబ్‌ ‌సంయుక్తంగా కలిసి 80 మంది పేదలకు నిత్యావసర వస్తువుల కిట్స్ ‌పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… కొరోనా గురించి అర్చకులు, ఫాస్టర్స్, ఇమామ్‌, ‌మౌజమ్‌లకు అవగాహన కల్పిస్తూ… ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు.

- Advertisement -

ప్రతి ఒక్కరు మీటరు దూరం డిస్టన్స్ ఉం‌డాలని, మాస్కులు ధరించాలనీ, ఇంకొన్ని రోజులు లాక్‌ ‌డౌన్‌కు సహకరిస్తూ.. ఇలాగే అందరం ఐక్యతతో కొరోనా వైరస్‌ ‌తరిమికొడదామన్నారు. కొరోనా వ్యాపించొద్దంటే.. జనం గుమికూడొద్దన్నారు. అత్యవసరంగా బయటకొస్తే.. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలన్నారు. కొరోనా మనిషిలో ప్రవేశించేది గొంతులోకి, ఆ తర్వాత అవయవాలపై ఆ వైరస్‌ ‌దాడి చేస్తుందనీ, ఇందు కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుచి, శుభ్రత అలవాటు చేసుకుని వేడి నీరు తాగాలని సూచించారు. జలుబు చేస్తే ఆవిరి పట్టినట్లు పసుపు వేసి ఆవిరి పట్టాలన్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలనీ, మాకేం అవుతుంది. ఏం కాదులే అనే నిర్లక్ష్యం వద్దన్నారు. అనవసరంగా బయట తిరగొద్దు. తిరిగి ఇంటి వాళ్లకు కొరోనాను అంటిచొద్దన్నారు. కొరోనా తర్వాత, కొరోనాకు ముందు అనే విపత్కర పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందని ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకుముందు సిద్ధిపేట మున్సిపల్‌ ‌కార్యాలయ ఆవరణలో 12లక్షల వ్యయం కలిగిన స్ప్రే మిషనరీ వాహనాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ప్రత్యేకించి ఢీల్లీ నుంచి ఈ వాహనాన్ని తెప్పించినట్లు, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోని కొరోనాకే కాకుండా భవిష్యత్తులో పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలకు వినియోగించాలని మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డికి మంత్రి సూచించారు.

సర్వ మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు చేయండి….
కొరోనా ఎఫెక్టుతో ప్రపంచానికి భారత సంస్కృతి తెలిసింది. షేక్‌ ‌హ్యాండ్‌ ‌వద్దు.. నమస్తే చాలంటూ.. ఇప్పుడు ప్రప్రంచమంతా భారత దేశాన్ని అనుసరిస్తున్నాయనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రంజాన్‌ ‌పండుగ సందర్భంగా సిద్ధిపేటలోని ముర్షద్‌ ‌గడ్డలో ముస్లిం మైనారిటీలకు ఇంటింటికీ ఆటోల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. అందరూ బాగుండాలని, మంచి సమాజం కోసం అల్లా, యేసు, దేవుడిని ప్రార్థించాలన్నారు. నమాజ్‌ ‌చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందనీ, దేశ, రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం, రంజాన్‌ ‌పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఉపవాసం ఉన్న మీరు రాష్ట్ర, దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అల్లాను ప్రార్థించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, ‌మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌రాజనర్సు, వైస్‌ ‌ఛైర్మన్‌ అక్తర్‌ ‌పటేల్‌, ‌కమిషనర్‌ ‌శ్రీనివాస్‌రెడ్డి, సుడా డైరెక్టర్‌ ‌మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు.

Leave a Reply