Take a fresh look at your lifestyle.

కరోనాపై నిర్లక్ష్యం వొద్దు వైద్య,ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఈటల ఆదేశం

Don't neglect, Corona virus,Minister, Health, etela

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌కరోనా వైరస్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆ ‌శాఖ అధికారులను ఆదేశించారు. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతీ ఒక్కరినీ జాగ్రత్తగా పరీక్షించాలని పేర్కొన్నారు. కేరళలో దేశంలోనే తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఆయన వైద్య,ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. చైనా నుంచి వచ్చిన వారు ఇంటి దగ్గర ఉన్నప్పటికీ వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఐసోలేషన్‌ ‌వార్డులో చికిత్సలు అందించేందుకు వైద్యులు అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్‌కు సంబంధించి ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామనీ అక్కడే వైద్య నిర్ధారణ పరీక్షలు సైతం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఈటల వెల్లడించారు.

Tags: Don’t neglect, Corona virus,Minister, Health, etela

Leave a Reply