Take a fresh look at your lifestyle.

బర్డ్‌ఫ్లూపై అపోహలు వద్దు: మంత్రి ఈటల రాజేందర్‌

  • సరిహద్దు జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి ఈటల రాజేందర్‌

‌తెలంగాణలో బర్డ్ ‌ఫ్లూ వచ్చే అవకాశం లేదనీ, దీనిపై ప్రచారంలో ఉన్న అపోహలను నమ్మవద్దనీ,మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదనీ, బర్డ్‌ఫ్లూ నివారణకు రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ‌ర్యాపిడ్‌ ‌యాక్షన్‌ ‌టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం బీఆర్కే భవన్‌లో పశు సంవర్ధక, మత్స్య శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, వైద్య,ఆరోగ్య శాఖ రిజ్వి, పౌల్ట్రీ సంస్థల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికెన్‌, ‌కోడిగుడ్డు తింటే బర్డ్ ‌ఫ్లూ వస్తుందనేది కేవలం అపోహ మాత్రమేననీ, దీంతో ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారని చెప్పారు.

- Advertisement -

ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ఇలాంటి అపోహలతో మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బర్డ్ ‌ఫ్లూ ఆనవాళ్లు లేవనీ, ఎక్కడా అనుమానాస్పద ఘటనలు నమోదు కాలేదని చెప్పారు. ప్రజలు అనవసర భయాందోళన, అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. సరిహద్దు జిల్లాలలో పశు సంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. వలస పక్షుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ ఈ సందర్భంగా మంత్రి ఈటల స్పష్టం చేశారు.

Leave a Reply