Take a fresh look at your lifestyle.

విద్యార్ధులు అధైర్యపడొద్దు

నేటి నుండి ప్రారం భమయ్యే పదవ తరగతి పరీక్షలకు హజరమ్యే విద్యార్ధులు అధైర్యడకుండా పరీక్షలు వ్రాయలని ప్రవేటు పాఠశాలల సంఘం జిల్లా కార్యదర్శి ఎండి.యూసఫ్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం మణు గూరులో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన పాల్గొని మాటా్ల డుతూ.. ఇప్పటి వరకు పాఠశాలల్లో నిర్వహించిన సాధా రణ పరీక్షల మాదిరిగానే వార్షిక పరీక్షలు వుంటాయన్నారు. ఏటువంటి అపోహలు పెట్టుకో కుండా విద్యార్ధులు నిశ్చింతగా పరీక్షకు హాజరు కావాలన్నారు. జిల్లా విద్యాశౄఖ ఆదేశాల మేరకు ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో వుంచుకొని పరీక్ష కేంద్రాల్లో విద్యార్ధులకు అవసరమైన అన్ని వసతులు సిద్ధంగా వున్నాయన్నారు.

కొంత మంది విద్యార్ధులు పరీక్షల ంటే విపరీతమైన భయాందోళన కలిగి సమాధానాలు సరిగ్గా రాయలేని స్థితిలో మానసికంగా ఆవేదన చెందుతుంటారని, అటు వంటి విద్యార్ధులు ముందు భయాన్ని వదిలేయాలన్నారు. తోటి విద్యార్ధు లతో కలిసి ఇష్టంగా పరీక్షకు హాజరు కావాలన్నారు. మనస్సులో ఏటువంటి ఆలోచలను పెట్టుకో కుండా పరీక్ష కేంద్రానికి నిర్దేశించిన సమయం కంటే గంట ముందుగానే చేరుకోవాలన్నారు. ప్రధానంగా ప్రస్తుత ప్రజలందర్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ‌గురించి విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్నీ పరీక్ష కేంద్రాలో కరోనా వైరస్‌ ‌వ్యాప్తికి సబంధించిన శానిటైజర్లను ఏర్పాటు చేశారన్నారు. ఎక్కువ జనస మూహాం ఉన్న చోట్ల కుండకూదన్నారు. జలుబు, దగ్గు వంటి వాటితో భాదపడుతున్న వారు మాస్క్‌లను ధరించి రావాలని సూచించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy