Take a fresh look at your lifestyle.

పరిశ్రమల్లో .. ఒక్క ఉద్యోగం కూడా పోవద్దు

  • ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించరాదు
  • అధికారులతో మంత్రి కెటిఆర్‌ ‌సమీక్ష
  • రంజాన్‌ ‌ప్రార్థనలపై ముస్లిం పెద్దలతో చర్చ

విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యంపై ఉందని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించొద్దని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఇప్టపికే ఐటి ఇండస్ట్రీతో మాట్లాడిన కెటిఆర్‌, ‌తాజాగా పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించారు. జిల్లాల కార్మిక, పరిశ్రమలశాఖ అధికారులతో మంత్రులు కేటీఆర్‌, ‌మల్లారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ’కార్మికులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలకు కూడా విద్యుత్‌ ‌బిల్లులు, ఆస్తిపన్ను చెల్లింపులో ప్రభుత్వం అనేక వెసులుబాటు కల్పించింది. వలస కార్మికులకు 12 కిలోల బియ్యంతో పాటు రూ.500 నగదు అందజేస్తున్నాం. వలస కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ‌తీసుకున్న చర్యలను ఇతర రాష్టాల్రు అనుసరిస్తున్నాయని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఇదిలావుంటే కరోనా వైరస్‌ ‌నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా సహకరిస్తామని ముస్లిం మతపెద్దలు తెలిపారు.

సోమవారం జీహెచ్‌ఎం‌సి కార్యాలయంలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ముస్లిం మత పెద్దలు మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు వచ్చారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో ముస్లిం మత పెద్దలు ఖుబుల్‌పాషా సత్తారి, ముఫ్తీ ఖలీల్‌అహ్మద్‌, ‌మహ్మద్‌పాషా, ఇఫ్తెకారి పాషా తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ రంజాన్‌ ‌మాసం సందర్భంగా సామాజిక దూరాన్ని పాటి ంచేందుకు తమ ఇళ్ల వద్దనే అన్ని ప్రార్ధనలు నిర్వహించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు వివరించారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఈ మహమ్మారి నుంచి బయట పడడమే ముందున్న లక్ష్యమని అన్నారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ ‌వివిధ జిల్లాల ఉన్నతాధికారులతో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల పై వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌, ‌డిప్యూటీ మేయర్‌బాబాఫసియుద్దీన్‌ ‌తదతరులు ఉన్నారు.

Leave a Reply