Take a fresh look at your lifestyle.

వరవర రావు ప్రాణం జైల్లోనే తీయకండి ..!

కుటుంబ సభ్యుల ఆవేదన 

భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా నిర్బంధంలో ఉన్న విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన  వరవర రావు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ..నిత్యకృత్యాలు కూడా తనకు తానూ గా చేసుకోలేని స్థితి లో ఉన్నారని ..తక్షణమే జైల్లో  వారికి కావలసిన వైద్యం అందించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ పై ఉందని వరవర రావు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా నే వరవర రావు బెయిల్ పై , ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కు కూడా వరవర రావు ఆరోగ్యం , బెయిల్ పై లేఖ రాయడం జరిగిందని కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు . 1969 నుంచి కూడా వరవర రావు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసునని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో అక్రమంగా నిర్బంధంలో ఉన్న వరవర రావు కు బెయిల్ ని కూడా తాము అడగడం లేదని ..తక్షణమే వరవర రావు కు నాణ్యమయిన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. జూమ్ ద్వారా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుటుంబ సభ్యులు వరవర రావు భార్య హేమలత , కూతురులు సహజ , అనల పాల్గొన్నారు. వీక్షణం ఎడిటర్ ఎన్ . వేణుగోపాల్ ఈ సమావేశం నిర్వహించారు .

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply