Take a fresh look at your lifestyle.

ఇరక్కపోయామనీ రంది పడొద్దు.. మీరు మా బంధువులే

  • సిద్ధిపేటలో వలసు కూలీలకు బియ్యం, నగదును అందజేసిన మంత్రి హరీష్‌రావు

లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇక్కడే ఇరుక్కుపోయామని రంది పడొద్దు. మీరు మా బంధువులే. హమ్‌ ‌సబ్‌ ‌హిందూస్థానీ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. వలస కూలీల ఆకలి తీర్చడం మా బాధ్యత అని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మంగళవారం  జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో 104 మంది వలస కార్మికులకు ప్రతి ఒక్కరికీ 12కిలోల చొప్పు బియ్యం, ఒక్కొక్కరికీ 500 రూపాయల నగదును ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రముఖ హాస్య నటుడు శివారెడ్డితో కలిసి మంత్రి హరీష్‌రావు అందజేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వలస వచ్చిన కూలీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందనీ,  జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 10 వేల మంది వలస కార్మికులకు ప్రతి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కొక్కరికి 500 రూపాయల నగదును అందజేసినట్లు వెల్లడించారు.  మరో 8 వేల మంది వలస కార్మికులకు త్వరలోనే అందిస్తామన్నారు.  ప్రతి ఒక్కరూ  భౌతిక దూరం పాటించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే.. ఉచిత భోజన సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని నిరభ్యంతరంగా తినొచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!