Take a fresh look at your lifestyle.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు: కలెక్టర్‌

దయచేసి చెప్తున్న రైతులను ఇబ్బంది పెట్టొద్దని మార్క్‌ఫెడ్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ ‌యంవి రెడ్డి చేతులు జోడించి కోరారు. బుధవారం నాడు లక్ష్మీదేవిపల్లి మండలంలో వ్యవసాయ మార్కెట్‌లో కందులు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. ఇక్కడ ఏమైనా సమస్యలున్నాయా , తక్షణం కొనుగోలు చేస్తున్నారా లేదా అని అడుగగా దాదాపు నాలుగు రోజుల సమయం పడుతుందని చెప్పారు. ఎందుకు అన్నీ రోజుల పడుతుందని అధికారులు ప్రశ్నించగా మందుగా నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు అవగాహన కల్పిస్తే సత్వరం కొనుగోలు చేయుటకు అవకాశం ఉంటుందని చెప్పారు. కేంద్రానికి తీసుకొచ్చిన తరువాత ఎండబెట్టడానికి సమం పడుతుందని అధకారులు చెప్గఆ , వ్యవసాయ అధికారులు ద్వారా మచ్చును తెప్పించి పరిశీలన చేయాలని చెప్పారు. మార్కెట్‌లో రైతులు, కూలీలు, భోజనాలు చేయుటకు షెడ్‌ ఏర్పాటు చేయించాలని కోరగా తక్షణం ఏర్పాటు చేస్తామని అందుకు ప్రతిపాదనల సిద్దం చేసి తనకు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కందులు కొనుగోలు చేసిన తదుపరి ఎన్ని రోజులకు డబ్బులు ఇస్తారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

దాదాపు నెల రోజులకు డబ్బులు చెల్లిస్తామని తెలుసుకున్నారు. విక్రయిమించకడానికి ఎన్ని రోజులు పడుతుందని రైతులను అడుగగా దాదాపు నాలుగు రోజుల నుండి ఇక్కడ ఉంటున్నామని రైతులు చెప్పగా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఒక్కో రైతు నుండి 10 క్వింటాళ్ళు వరకు మాత్రమే కందులు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్పగా రైతు ఆరుకాలం కష్టించి చేతికొచ్చిన పంటను విక్రయించడానికి కొనుగోలు కేంద్రానికి వస్తూ కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తూ రోజుల యార్డుల్లో ఉండటం చాలా శోచనీయమని చెప్పారు. యార్డుల్లో ఎండచాలా తీవ్రంగా ఉందని యార్డుల్లో ఉండాలంటే ఎంతమేరకు వీలైతే అంతమేరకు మొక్కలు నాటాలని ఆయన సూచించారు. ఎంతో సుదూర ప్రాంతాల నుండి రైతులు కందులు విక్రయిండానికి వస్తే కనీస సౌకర్యాలు కూడ కల్పించకోతే ఎలా ప్రశ్నించారు. జిల్లా మార్కెట్‌ అధికారి కార్యాలయంలో మరుగుదొడ్లును పరిశీలించారు. అపరిశుభ్రత ఉన్నాయని తక్షణం మరమత్తులు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసి 15 రోజుల నూతన మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పారు. నిర్మాణం పూర్తి చేసి తనకు నివేధికలు అందచేయాలని తిరిగి మళ్ళీ తాను తనిఖీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు డియంఓ నరేందర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply