Take a fresh look at your lifestyle.

అం‌గన్‌వాడీ కేంద్రాలను మూసేయొద్దని ధర్నా

anganwadi centres, icds privatisationఅంగన్‌వాడీ కేంద్రాల మూసివేత,విలీన ప్రక్రియకు ప్రభుత్వం మొగ్గుచూపటాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంఘ జిల్లా కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేసారు. తెలంగాణ అంగన్‌వాడీ హెల్పర్స్ ‌యూనియన్‌(‌సిఐటియు) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఐసిడిఎస్‌ను కూడా యదావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ ‌చేసారు.

అంగన్‌వాడీ కేంద్రాల మూసివేత, విలీన ప్రక్రియ ఐసిడిఎస్‌కు అత్యంత ప్రమాదకరమైన చర్య అని, ఇది ఐసిడిఎస్‌ను ప్రైవేటికరణకు తప్ప మరోకటి కాదన్నారు. ఈ నిర్ణయంతో అంగన్‌వాడీల ఉద్యోగభద్రత ప్రమాదంలో పడుతుందని చెప్పారు. గర్బిణీ, పిల్లలు,బాలింతలతో అంగన్‌వాడీ ఉద్యోగులకు నష్టం కలిగించే ఈ చర్యల ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఐసిడిఎస్‌ ‌సేవలను మిగిలినవాటితో పోల్చటం సరికాదన్నారు. ఐసిడిఎస్‌ను స్కీంగా కాకుండా ప్రభుత్వ సంస్తగా గుర్తించాలని, ఇందులో పనిచేస్తున్న అంగన్‌ ‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్‌ ‌చేసారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్దన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: anganwadi centres, icds privatisation, citu thumma vishnu vardhan

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply