Take a fresh look at your lifestyle.

మహిళలపై దారుణాలు పట్టించుకోరా..?

Dont care about attack on women

తెలంగాణలో మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోరా అని  రాష్ట్ర సర్కారును జాతీయ మహిళా కమిషన్‌  (ఎన్‌సీడబ్యు) ప్రశ్నించింది. మహిళలపై దాడుల కేసులు విచారించేందు•కు వెంటనే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ (‌టీఎస్‌సీడబ్ల్యు)కు  చైర్‌పర్సన్‌ను నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జాతీయ మహిళా కమిషన్‌  (ఎన్‌సీడబ్ల్యు) చైర్‌పర్సన్‌ ‌నిర్దేశించింది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యు చైర్‌పర్సన్‌ ‌రేఖాశర్మ తెలంగాణ రాష్ట్రప్రధాన కార్యదర్శికి ఆదేశాలు పంపించారు. తెలంగాణ మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పదవి 2018 నుంచి ఖాళీగా ఉంది. మరో వైపు రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు వంటి నేరాలు ఎన్నో జరుగుతున్నాయి. మూడు నెలల క్రితం హైదరాబాద్‌ ‌శివారులో యువతి ‘దిశ’పై దారుణంగా హత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం  సృష్టించింది. మహిళాసంఘాలు భగ్గుమన్నాయి. ఆదిలాబాద్‌లో మరి కొన్ని చోట్ల కూడా అటువంటి దారుణాలు జరిగాయి. బాధితులు, సామాజిక ఉద్యమకారులు, మహిళా సంఘాల నుంచి  గత రెండేండ్లలో రాష్ట్ర కమిషన్‌కు దాదాపు వంద ఫిర్యాదులు వచ్చినట్లు అంచనా. 2018లో 46 ఫిర్యాదులు, 2019లో మరింత ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు  కమిషన్‌కు అందినట్లు  మీడియా కథనాలు తెలుపుతున్నాయి. అయితే ఈ ఫిర్యాదులను విచారించడానికి తెలంగాణ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ ‌లేకపోవడంతో ఆ కేసులన్నీ పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయి.

 

- Advertisement -

రాష్ట్రంలో మహిళలపై పలు అత్యాచారాలు జరుగుతున్నా రెండేండ్లుగా ఖాళీగా ఉన్న కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను ఎంపిక చేయాలని రాష్ట్ర సర్కారు ఆలోచించకపోవడం  దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని ఎన్‌సీడబ్ల్యు చైర్‌పర్సన్‌ ‌రేఖాశర్మ విమర్శించారు. ఈ విధంగా గత రెండేండ్లుగా తెలంగాణ మహిళా కమిషన్‌ను పని చేయకుండా ఉంచడం  ఎంతమాత్రం ఆమోదయోగ్యమైన విషయం కాదని అన్నారు. గత నవంబర్‌లో జరిగిన దిశ హత్య గురించి ఆమె ప్రస్తావించారు. నిజానికి ఈ విషయమై ఎన్‌సీడబ్యు కొంతకాలం క్రితమే సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది.  మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ ‌నియమించాల్సిన అవసరాన్ని సీఎం దృష్టకి తీకువెళ్లాలని రాష్ట్రప్రధాన కార్యదర్శిని కూడా కోరింది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. కమిషన్‌కు చైర్‌పర్సన్‌ ఎం‌పిక చేయలేదు. 2018 జూలై వరకు రాష్ట్ర మహిళా కమిషన్‌కు త్రిపురాన వెంకటరత్నం చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె ప•వీకాలం ముగిసిన తరువాత ఆమె స్థానంలో మరొకరి నియామకం జరుగలేదు. అదే ఏడాది కేసీఆర్‌ ‌రెండోసారి  సీఎంగా ఎన్నికయ్యారు.  కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించడం క్లిష్టతరమైన ప్రక్రియ ఏమీ కాదు. దీనికి నోటిఫికేషన్‌ ‌జారీ చేసి ఇంటర్వ్యూలు చేయడం వంటివి అవసరం లేదు. సీఎం నేరుగా తగినవ్యక్తిని ఎవరినైనా ఎంపిక చేసి ఈ పదవిలో నియమించవచ్చు. అయినా ఈ విషయాన్ని సీఎం పట్టించుకోవడం లేదు.

 

మహిళలపై దాడుల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలావుంటే,తెలంగాణ మహిళా కమిషన్‌కు ఆన్‌లైన్‌ ‌పోర్టల్‌ ‌లేకపోవడం మరో లోపం. పోర్టల్‌ ఉం‌టే చాలామంది కమిషన్‌కు సులువుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. పోర్టల్‌ ‌లేనందువల్ల బా•ధితులు పోలీసులను ఆశ్రయించవల్సి వస్తున్నది. ఈ సమస్య గురించి కూడా సామాజిక మహిళా కార్యకర్తలు, హక్కుల సంఘాలవారు  ఎన్నో మార్లు చెప్పారు. ‘ఆన్‌లైన్‌ ‌పిటిషన్లు స్వీకరించే అవకాశం ఉంటే తెలంగాణ మహిళా కమిషన్‌ ‌పూర్తిస్థాయిలో పని చేయగలుగుతుంది. కనీసం ఈ ఏడాది మహిళా దినోత్సవం నాటికైనా ఈ ఏర్పాటు చేయించండి’ అని  కమిషన్‌ను కోరేందుకు కొలిపాక స్ఫూర్తి అనే కార్యకర్త సంతకాల ఉద్యమం ప్రారంభంచారు. ఆన్‌లైన్‌ ‌పిటిషన్‌ను రూపొందించి జాతీయ మహిళా కమిషన్‌కు అందచేశారు. ఇప్పటివరకు 20 వేల మందికిపైగా పిటిషన్‌పై సంతకాలు చేశారు.  ‘తెలంగాణ దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఐటీతోపాటు పలు రంగాల్లో శరవేగంగా ప్రగతిపథంలో పయనిస్తున్నదన్న గుర్తింపు తెచ్చుకున్నది. స్త్రీ శిశు సంక్షేమశాఖ నుంచి కమిషన్‌కు వందశాతం నిధుల అందుతున్నాయి. అయినా కమిషన్‌కు ఒక వైబ్‌సైట్‌ ‌లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం అని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీడబ్యు చైర్‌పర్సన్‌ ‌రేఖాశర్మ తెలంగాణ రాష్ట్రప్రధాన కార్యదర్శితో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply