Take a fresh look at your lifestyle.

‌ప్రజలు వదంతులు నమ్మొద్దు : కలెక్టర్‌

జిల్లాలో కరోనా వైరస్‌ ‌బాధితుల కొరకు ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఇమామ్‌పేట మైనార్టీ రెసిడెన్షియల్‌ ‌బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్లను ఆర్డిఓ మోహన్‌రావులతో కలిసి సంద ర్శించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతు వివిధ ప్రాంతాల నుండి వైరస్‌ అనుమానిత బాధితు లను క్వారంటైన్లలో ఉంచామని, అనుమానితుల శ్యాంపిల్స్‌ను సేక రించి పరీక్షల నిమిత్తం పంపిం చడం జరిగిందని తెలిపారు. ప్రతి క్వారంటైన్లలో మెరుగైన సదుపా యాలు కల్పించామని అన్నారు.

జిల్లాలో కంటెన్మెంట్‌ ‌ప్రాంతాలలో గల అన్నీ కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకున్నామని, లాక్‌డౌన్‌కు ప్రజలు తప్పకపాటించాలని కోరారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు ఎవరు కూడా అభద్రతాభావంతో ఉండరాదని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జిల్లా అంతటా పబ్లిక్‌ అ‌డ్రస్‌ ‌సిస్టమ్‌ ‌ద్వారా ప్రజలకు వైరస్‌ ‌నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలపై పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. బాధితుల నుండి సేకరించిన శాంపిల్స్‌ను వెనువెంటనే పంపా లని వైద్యులను ఆయన సూచిం చారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ ‌సాంబ శివరావు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!