Take a fresh look at your lifestyle.

భయం వద్దు..భవిష్యత్‌ ‌మనదే

“కొరోనా పాజిటివ్‌ ‌వచ్చిందనే భయంతో నర్సంపేట పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ మహిళకు కొరోనా పాజిటివ్‌ అని తెలియగానే ఆందోళనకు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలో జరిగింది. తన కుమారుడికి కొరోనా పాజిటివ్‌ ‌రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. తనకూ కొరోనా వచ్చిందేమోనన్న అనుమానంతో గుంటూర్‌కు చెందిన వృద్ధుడు మానసికంగా కుంగిపోయాడు. అదే భయంతో చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. కొరోనా కంటే మరో భయం తో కలిగే మానసిక ఆందోళన ఇప్పుడు ప్రజలను అత్యంత భయకంపితులను చేస్తోంది. మనసు పెట్టి ఆలోచన చేసే సమయం లేకుండా చేస్తోంది. కొరోనా కంటే కరోనా వస్తుందేమో, వస్తే నేను ఏమైపోతానో అనే అభద్రతా, ఆత్మనూన్యత అనే భయం తో చావే పరిష్కారంగా ఆత్మహత్యలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొరోనా మరణాలు కంటే  ప్రజల ఆత్మహత్య మరణాలు మరింతగా ఆందోళన కలిగిస్తున్నాయి.”

కొరోనాపై అంతిమ విజయం మనదే
కొరోన జయించిన వారే స్పూర్తి 

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా అనే వైరస్‌ ‌వణికిస్తోంది. సుమారుగా 200 రోజులకు పైగా తెలుగు రాష్ట్రాలను, మన దేశాన్ని కూడా భయకంపితులను చేస్తోంది. గడపదాటనివ్వడం లేదు. స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదు. మనసారా ఇతరులతో  మాట్లాడనివ్వడం లేదు. ఇంతగా వణికిస్తున్న కరోనా ప్రజలను తన గుప్పిట్లో పెట్టేసుకుంది. ఇటీవల దేశ వ్యాప్తంగా పత్రికలలో వచ్చిన సంఘటనలు కరోనా వచ్చిందన్న అనుమానంతో ఆత్మహత్య చేసుకోవడం మరింతగా ప్రజలు భయకంపితులను చేస్తోంది. కరోనా భయం జనాలను వణికిస్తోంది. ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు ఈ మధ్య మనం తరుచుగా చూస్తున్నాం. కొరోనా అనుమానంతో ఆత్మహత్యలు:  హైదారాబాద్‌లో కరోనా భయంతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కరోనాతో చిక్సిత పొందుతూ ఒకరు, కొరోనా సోకిందేమోనన్న భయంతో మరొకరు, టీవీలో కరోనా వార్తలు చూసి ఆందోళన చెంది ఇంకొకరు ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా పాజిటివ్‌ ‌వచ్చిందనే భయంతో నర్సంపేట పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ అని తెలియగానే ఆందోళనకు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలో జరిగింది. తన కుమారుడికి కరోనా పాజిటివ్‌ ‌రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. తనకూ కరోనా వచ్చిందేమోనన్న అనుమానంతో గుంటూర్‌ ‌కు చెందిన వృద్ధుడు మానసికంగా కుంగిపోయాడు. అదే భయంతో చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. కరోనా కంటే మరో భయం తో కలిగే మానసిక ఆందోళన ఇప్పుడు ప్రజలను అత్యంత భయకంపితులను చేస్తోంది. మనసు పెట్టి ఆలోచన చేసే సమయం లేకుండా చేస్తోంది. కరోనా కంటే కరోనా వస్తుందేమో, వస్తే నేను ఏమైపోతానో అనే అభద్రతా, ఆత్మనూన్యత అనే భయం తో చావే పరిష్కారంగా ఆత్మహత్యలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరోనా మరణాలు కంటే  ప్రజల ఆత్మహత్య మరణాలు మరింతగా ఆందోళన కలిగిస్తున్నాయి.

భయంతో ఏర్పడే లక్షణాలు:
ప్రస్తుత పరిస్థితులను టీవీలు, సామాజిక మాధ్యమాల్లో చూసి ఏదో జరిగిపోతుందని భయపడుతుండే వారిలో ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. గుండె దడ, విపరీతమైన ఆందోళన, చేతులు వణకడం, నీరసంగా కనిపించడం, అన్నం సరిగా తినబుద్ది కాకపోవడం.   నిద్రపట్టకపోవడం, నెగిటివ్‌ ఆలోచనలు, భవిష్యత్తుపై ఆశ కోల్పోవడం…వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
కరోనా పై మానవాళిదే విజయం: జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు అవే ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనె నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆత్మహత్యలకు పురిగొల్పబడుతాయి. మనపై ఆధారపడిన, చిన్నప్పటి నుండి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిలించడం భావమా. జీవితంపై సరైన అవగాహన, దృక్పథం లేకపోవడం మూలంగా ఆత్మహత్య ఆలోచనలు మదిని తొలచివేస్తూ ఉంటాయి. సమస్యలకు పరిష్కారమే లేదని భావిస్తున్నారు. ఒక్క క్షణం సానుకూలంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం కళ్లముందు కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండీ ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇంత దూరం ప్రయాణం చేశామనే విషయాన్ని మరవద్దు. అంతిమంగా కరోనా పై మానవాళిదే విజయం.

అనవసర భయాన్ని వీదండి:
ఏదో జరుగుతుందన్న భయం, నిద్రలేమి, గిల్టీఫీలింగ్‌, ‌పరధ్యానం, ఆకలిలేమి వంటి లక్షణాలతో బాధపడేవారు తమకు తాము ఒకసారి పరిశీలించుకోవాలి. మానసిక ఒత్తిడికి గురవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కరోనాను జయించాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు. అనవసర భయాలను వీదండి. ప్రతి రోజూ పది నిమిషాలు ధ్యానం చేయండి.

కౌన్సెలింగ్‌ ‌తీసుకోండి:
మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం తీసుకోవడానికి వెనుకడుగు వేయకండి. ఒక వేళ కరోనావైరస్‌ ‌గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నారని మీరు భావిస్తే వెంటనే మనస్తత్వవేత్త ల సహాయం తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకొంటూ భవిష్యత్తుకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మనసులో కలిగే భయాలను మరియు ఆందోళలను తగ్గించడానికి మనస్తత్వవేత్తల  కౌన్సెలింగ్‌ ‌చాలా వరకు దోహదం చేస్తుంది.

సోషల్‌ ‌మీడియా నుంచి బ్రేక్‌ ‌తీసుకోండి:
సోషల్‌ ‌మీడియా వలన కూడా మానసిక ఆందోళన కలుగుతోంది, సోషల్‌ ‌మీడియాలో కొన్ని తప్పుడు హాష్‌ ‌టాగ్స్ ‌చూస్తూ భయాందోళనలకు గురవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ట్విట్టర్‌ ‌లాంటి వెబ్‌ ‌సైట్‌ ‌లలో పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా వస్తున్న సమాచారాన్ని, అకౌంట్లను మ్యూట్‌ ‌లేదా అన్‌ ‌ఫాలో చేయండి. మీకు అక్కరలేని సమాచారాన్ని ఇస్తున్న వాట్సాప్‌ ‌సందేశాల్ని మ్యూట్‌ ‌చేయండి. అలాగే మూకుమ్మడిగా వస్తున్న ఫేస్‌ ‌బుక్‌ ‌పోస్టులను కూడా అన్‌ ‌ఫాలో చేయవచ్చు. హాష్‌ ‌టాగ్స్ ‌మీద క్లిక్‌ ‌చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి, ఆందోళనకి గురి చేసే సమాచారానికి దూరంగా ఉండడమే మంచిది. సోషల్‌ ‌మీడియా నుంచి దూరంగా ఉంటూ, టీవీ చూడటం, పుస్తకాలు చదవటంలో గడుపడానికి ఎక్కువ సమయం కేటాయించుకోవాలి.

పాజిటివ్‌ ఆలోచనలను పెంచుకోవాలి:
నెగెటివ్‌ ఆలోచనలని వదిలేయండి. కరోన భయం దానంతటదే వెళ్ళిపోతుంది. మీరు మీకు వచ్చే ఆలోచనలన్నిటికీ స్పందించనక్కర లేదు. అవన్నీ ఒక మబ్బులా మాయమవుతున్నట్లు ఊహించుకోవాలి. పాజిటివ్‌ ఆలోచనలను పెంచుకోవాలి. ఇస్టమైన పనిని చేసుకునే ప్రయత్నం చేయండి నెమ్మదిగా మీ దృష్టిని మరో అంశం పైకి మరల్చండి. మనోదైర్యమే మందు.
కొరోన జయించిన వారే స్పూర్తి: ప్రపంచంలో కరోనాను జయించిన వారెందరో ఉన్నారు. వృద్దులనుండి మొదలుకొని కాన్సర్‌ ‌బాధితులు కూడా కరోనాను జయిస్తున్నారు అనే విషయం గుర్తు చేసుకోండీ. గతంలో కూడా ఇలాంటి ఎన్నో భయంకర వ్యాధులు ప్రపంచాన్ని గడగడలాడించినప్పటికీ వాటినన్నింటిని  జయించిన మనిషి కరోన పై కూడా విజయ బాహుటాను ఎగరవేస్తున్నాడు. కరోనాను కాల గర్భంలో కలిపేసే రోజులు అతి త్వరలోనే రానున్నాయి .

ఆప్తులతో మాట్లాడుతూ ఉండండి:
స్వీయ నిర్బంధంలో (గృహానికే పరిమితం) ఉండడం వల్ల ఏమి చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. ఈ సమయంలో ఆప్తుల ఫోన్‌ ‌నంబర్లు, ఇమెయిల్‌ అ‌డ్రస్లు అందుబాటులో ఉంచుకోవడం మంచిది. ఆప్తులతో తరచుగా సంభాషణల్లో ఉండటం మంచిదే. ప్రతి రోజు ఒకేలా ఉండకుండా కొత్త పనులు చేసేటట్లుగా దినచర్యను రూపొందించుకోవాలి. ఎప్పటి నుంచో చేయకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకోవచ్చు, చదవాలనుకుంటున్న పుస్తకాలు అన్నీ చదువుకొనెలా ప్లానింగ్‌ ‌చేసుకోవాలి.

డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply