Take a fresh look at your lifestyle.

ఆపదలో ఆదుకుంటున్న దాతలు అభినందనీయం

సూర్యాపేట, మే 14, ప్రజాతంత్ర ప్రతినిధి): కరోనా వైరస్‌ ‌నేపధ్యంలో దాతలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులను అందజేయడం అభినందనీయమని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌వసంత సత్యనారాయణ పిళ్లై యాదవ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సిద్దార్థ హై స్కూల్‌లో మాన్‌ ‌పోర్టు సోషల్‌ ఇని్ట••ట్యూట్‌ ‌సహకారంతో గృహ కార్మికులకు యూనియన్‌ ఆధ్వర్యంలో 150కుటుంబాలకు బియ్యం, 10రకాల నిత్యావసర వస్తువులను అందజేసి మాట్లాడారు. లాక్‌డౌన్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఇబ్బందులను తీర్చడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైయ్యాయని గుర్తుచేశారు. అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు మాట్లాడుతు ప్రభుత్వ గోదాములలో ఉన్న బియ్యాన్ని ప్రతి కుటుంబానికి 50కేజీల చొప్పున అందించాలని కోరారు. కేరళ ప్రభుత్వం లాగా ప్రజ)కు బియ్యం, 16రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేయాలని తెలిపారు. ఇక్కడ 150కుటుంబాలకు వస్తువులను అందజేశామని, జిల్లాలో మరో 350మంది కార్మికులు ఉన్నారని దాతలు సహకరిస్తే మిగిలి ఉన్న కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ స్కూల్‌ ‌కరస్పాండెంట్‌ ‌హనుమంతరావు, అజిత్‌, ‌రాములమ్మ, నరసమ్మ, నిర్మల, జానమ్మ, శంకరమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో…
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్‌ అన్నారు. గురువారం జనగాం క్రాస్‌రోడ్డు వద్ద గల వలస కార్మికులకు లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా వ్యాధి మూలంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారు వారి స్వస్థలాలకు వెళ్లే క్రమంలో ఆకలితో అలమటిస్తున్నారని, వారి బాధను చూసి లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు వారి తండ్రి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గండూరి శంకర్‌, ‌నూకల వెంకటరెడ్డి, శ్రీనివాస్‌, ‌బిక్షం, రమేష్‌, ‌వెంకటేష్‌, ‌సాలయ్య తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేటలో
రామన్నపేట, మే14 (ప్రజాతంత్ర విలేకరి) మండలంలోని దుబ్బాక గ్రామంలోని రేషన్‌ ‌కార్డు లబ్దిదారులకు ఎంపిటిసి మడూరి జ్యోతిరామచందర్‌ ‌రావు గురువారం మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం తప్పక పాటించాలని కోరారు. అనంతరం ప్రభుత్వం ప్రతి రేషన్‌ ‌కార్డు దారునికి ఉచితంగా అందించిన 1కేజీ కందిపప్పు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఓ ‌నర్సయ్య, రేషన్‌ ‌లబ్దిదారులు పాల్గొన్నారు.

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో…
లాక్‌డౌన్‌ ‌ను పకడ్బందీగా అమలు చేయడంలో పోలీసుల పాత్ర కీలకమని బిజెపి పార్టీ జిల్లా కార్యదర్శి, సింగిల్‌ ‌విండో డైరెక్టర్‌ ‌కన్నెగంటి వెంకటేశ్వర చారి అన్నారు. గురువారం స్థానిక మండల కేంద్రంలోని పోలీస్‌ ‌చెక్‌ ‌పోస్ట్ ‌వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న లాక్‌ ‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్‌ఐ ‌సిహెచ్‌ ‌సాయిలు పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో పాలుపంచుకున్న పోలీస్‌ ‌సిబ్బందికి దాతలు ముందుకు వచ్చి భోజన ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్కూరి బిక్షపతి, కొమ్ము యాదయ్య, బేతి శ్రీనివాస్‌, ‌యాదాసు లక్ష్మణ్‌, ‌చిన్నపాక స్వామి పాల్గొన్నారు.

Leave a Reply