Take a fresh look at your lifestyle.

ఆపద కాలంలో ఆదుకుంటున్న దాతలు

ఖమ్మం అర్బన్‌, ‌మే 6  (ప్రజాతంత్ర విలేకరి) : కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్‌ ‌పటిష్టంగా అమలు అవుతున్నం దున పనులు లేక ఇబ్బంది పడుతున్న 300 నిరుపేద కుటుంబాలకు బుధవారం ఆ డివిజన్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌నాయ కులు కులిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 9వ డివిజన్‌ ‌పరిధి అయిన రోటరీనగర్‌లో లాక్‌డౌన్‌ ‌విధించిన రోజు నుండి వివిధ కార్యక్రమాలు చేపడు తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌ ‌నియంత్రణలో ప్రభుత్వ అధికారులు, పోలీసులు, వైద్యులు చేస్తున్న కృషిని గమినించి వారికి సంపూర్ణ సహకారం అందించాలన్నా రు.  కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ ‌నాయకులు రామారావు, సురేష్‌, ‌రవి, సుదర్శన్‌, ‌సతీష్‌, ‌రమేష్‌  ‌పాల్గొన్నారు.
సూర్యాపేటలో…
సూర్యాపేట, మే 6, ప్రజాతంత్ర ప్రతినిధి): కరోనా లాక్‌డౌన్‌ ‌నేపధ్యంలో సుమారు 45రోజుల నుండి వారి కులవృత్తికి దూరమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న మేరు కుల కుటుంబాలకు, ఆ కుల జిల్లా అధ్యక్షులు మేడిగ సురేష్‌ ఆధ్వర్యంలో సుమారు 100కుటుంబాలకు నిత్యావసర వస్తువులను రాజ్యసభ సభ్యులు బడగుల లింగయ్య యాదవ్‌ ‌చేతుల మీదుగా బుధవారం అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తన పార్ల మెంట్‌ అభివృద్ది నిధుల నుండి 5లక్షల రూపాయలు కేటాయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కొత్తకొండ కరుణాకర్‌, ‌సిద్దప్ప, కృష్ణ, రేణిగుంట్ల నరేందర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.
డ్యాన్స్ ‌కళాకారులకు చేయూత
ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గత 45రోజులు నుండి లాక్‌డౌన్‌ ‌కొనసాగుతుంది. ఇట్టి లాక్‌డౌన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా కళాకారులకు రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌పుట్ట కిషోర్‌ ఆధ్వర్యంలో బుధవారం ఒక్కొ క్కరికి 25కేజీల చొప్పున బియ్యం బ్యాగ్‌లను అంద జేయడం జరిగింది. అదే విధందా విదేశాల్లో ఉన్నటు వంటి పేరిణి నరేష్‌, ‌రమేష్‌ ‌మాస్టర్స్ ‌నిత్యావసర వస్తు వులను అందజేశారు. ఇట్టి చేయూత కార్యక్రమాన్ని సహకరించిన జిల్లా డాన్స్ అసోసియేషన్‌ ‌గౌరవ సలహాదారులు బండి రాధకృష్ణ రెడ్డిలకు కళాకారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి గణేష్‌, ‌చామల అశోక్‌, ‌రాంబాబు, మధు, రవి తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేటలో…
రామన్నపేట, మే6(ప్రజాతంత్ర విలేకరి) మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఒగ్గు కళాకారులు, కోలాటం, చిందు, యక్షగానం, వివిధ రకాల జానపద కళాకారులకు జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ‌సహకారంతో అందిం చిన నిత్యావసర సరుకులను స్థానిక తాసిల్దార్‌ ‌కార్యాల యం ఆవరణలో బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నేబోయిన జ్యోతి, వైస్‌ ఎం‌పీపీ నాగటి ఉపేందర్‌, ‌డిప్యూటీ తాసిల్దార్‌ ఎం‌డి ఇబ్రహీం, సర్పంచ్‌ ‌శిరీష, ఎంపీటీసీ ఎండి రెహాన్‌, ‌కళాకారుల బృందం చిన్నపాక సంజయ్‌ ‌కుమార్‌, ‌మిర్యాల వెంకన్న, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
గరిడేపల్లిలో…
గరిడేపల్లి, మే 6(ప్రజాతంత్ర విలేకరి) :మండలంలోని వెలిదండ గ్రామంలో పెనుయోలు సంస్థ సహకారంతో నిరుపేదలైన 80 కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలను ఆ సంస్థ పెద్దలు సుదర్శన్‌, ‌ధర్మకర్తలు శామ్యూల్‌ ‌పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఆదూరి పద్మ కోటయ్య, ఎస్సై వెంకన్నగౌడ్‌, ఎం‌పీటీసీ విజయ, రవి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
భూదాన్‌ ‌పోచంపల్లిలో…
భూదాన్‌ ‌పోచంపల్లి,మే6,( ప్రజాతంత్ర విలేకరి) భూదాన్‌ ‌పోచంపల్లి పురపాలక కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన 450 మంది నిరుపేద కుటుంబాలకు, ఆటో యూనియన్‌ ‌సభ్యులు 54 మందికి,మండల పరిధిలోని దేశముకి గ్రామానికి చెందిన 60 మంది నిరుపేద కుటుంబాలకు బుధవారం శివకృష్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్‌, ‌ఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ‌పాలెం శివకృష్ణ గౌడ్‌ ‌చేతుల మీదుగా కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ ‌డైరెక్టర్లు ఫైళ్ల మహేష్‌, ‌సైదుగాని స్వామి,గోడల మనోహర్‌,‌శెట్టి మల్లేష్‌, ‌పాలెం వికాస్‌,‌బింగి భానుచందర్‌,‌తంతరపల్లి మహేందర్‌, ‌చంద్రశేఖర్‌, ‌శనిగారం జగదీష్‌ ‌పాల్గొన్నారు.
మధిరలో…
మధిర,  మే 6 (ప్రజాతంత్ర) : మండల పరిధిలోని నాగవరప్పాడు గ్రామంలో నిరుపేద కుటుంబాలకు సుమారు రూ.60వేల రూపాయల విలువ చేసే సరుకు లను చావలి రామరాజు, నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ అధ్యక్షులు కూరాకుల నాగభూషణం చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, తహశీల్దార్‌ ‌డి.సైదులు, ఎంపిడిఓ శంకర్‌, ఇఓఆర్‌డి రాజారావు, సిద్దినేనిగూడెం సహకార సంఘం అధ్యక్షులు కటికల సీతారామిరెడ్డి, ఎర్రుపాలెం సర్పంచ్‌ ‌మొగిలి అప్పారావు, డీలర్‌ ‌దాసరి నారాయణ పాల్గొన్నారు.

Leave a Reply