Take a fresh look at your lifestyle.

అన్నదాతలూ…ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు

వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు
ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సిఎం ప్రకటించారని మంత్రి వెల్లడి
సిఎం కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని హరీష్‌రావు ఆత్మీయ భరోసా

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : అన్నదాతలు ధైర్యంగా ఉండాలి. రైతు నాయకుడు కేసీఆర్‌ ‌సిఎంగా ఉన్నటువంటి  రైతు ప్రభుత్వం. రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు. రైతుల పక్షపాతి అయిన నాయకుడు కేసీఆర్‌ ఉన్నారు. కాబట్టి ఎవరూ కూడా ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కోరారు.  నోటికాడి బుక్క జారిపోయిందని ఎంతో బాధతో ఉన్న రైతులను ఓదార్చడానికి సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌, ‌వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గ్రామాలలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని హరీష్‌రావు చెప్పారు.  మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, వడగండ్ల వానతో దెబ్బతిన్న పంట చేన్లను మంత్రి హరీష్‌రావు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రై•తులకు ఆత్మీయ భరోసానిచ్చారు. అకాల వర్షాలతో నష్టపోయిన పొలాలను పరిశీలించారు. దుబ్బాక, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని నాంచారుపల్లి, బక్రిచెప్యాల, పొన్నాల, ఎన్సాన్‌పల్లి, తడ్కపల్లి, వెంకటాపూర్‌, ‌బుస్సాపూర్‌, ఇర్కోడ్‌, ‌తొర్నాల, తిమ్మాపూర్‌, ‌తొగుట, పెద్దగుండవెళ్లి, దుంపలపల్లి, దుబ్బాకలో వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను క్షేత్ర స్థాయిలో మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. వడగండ్ల వానతో దెబ్బతిన్న  సిద్దిపేట అర్బన్‌ ‌మండలంలోని నాంచార్‌పల్లి గ్రామంలోని పంట పొలాలను జిల్లా కలెక్టర్‌ ‌వ్యవసాయ అధికారులతో కలిసి  పరిశీలించి నష్టపోయిన పంటలకు  రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందించేలా చూస్తాననీ రైతులు అధైర్యపడకూడదని భరోసానిచ్చారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో మొదటి దశలో పర్యటించి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రతీ ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సిఎం కేసీఆర్‌ ‌ప్రకటించారని మంత్రి వెల్లడించారు.  భారత దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా రూ.2, 3 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ సీఎం కేసీఆర్‌ ‌స్వయంగా రైతుబిడ్డ కాబట్టి రైతులను కాపాడుకోవాలని, రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఇప్పటికే రూ.10వేలు ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. గ్రామాలలో నష్టపోయిన ఏ ఒక్క రైతు మిస్‌ ‌కాకుండా వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు ఫీల్డ్‌లో పర్యటించి వివరాలన్నీ ప్రభుత్వానికి వెంటనే పంపాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. వాస్తవానికి యాసంగిలో ఎంతో నాణ్యమైన కరెంటు కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి, ప్రయివేటు ఎక్చేంజ్‌లోకొని రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసింది. కానీ, దురదృష్టం రైతుబంధు ఇచ్చి, నాణ్యమైన కరెంటు ఇచ్చి నోటి కాడికి వచ్చిన బుక్క జారిపోయినట్లు ఈ ప్రకృతి వైపరీత్యం వడగండ్ల వాన రూపంలో చాలా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సిద్ధిపేట జిల్లాలోనే ఇప్పటికే 35 వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు వివరాలు వచ్చాయనీ, మంగళవారం రాత్రి జరిగిన ప్రకృతి వైపరీత్యంలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు సాయంత్రం వరకు తెలుస్తాయన్నారు. ఇప్పటికే సిఎం కేసీఆర్‌ ‌రాష్ట్ర చీఫ్‌ ‌సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఈ దరిమిలా అన్నీ జిల్లాలో  మంత్రులు వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం పక్షాన రైతులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతులు అధైర్యపడొద్దు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడుకుంటాం. డిసెంబరు నెలలో రైతులు వరినాట్లు వేసిన దరిమిలా శ్రీరామ నవమి పండుగలోపు చాలా చోట్ల పంట కోతలు పూర్తయ్యాయన్నారు. మనం భవిష్యత్తులో నెలముందే పంట కోత తెచ్చుకోగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. వానా కాలం పంట ఒక నెల ముందు జరుపుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోకుండా ఉంటామని రైతులకు మంత్రి హరీష్‌రావు హితవు పలికారు.

Leave a Reply