Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌లో ఔదార్యాన్ని చాటుతున్న దాతలు

కరోన లాక్‌ ‌డౌన్‌ ‌నియంత్రణలో పనులు లేక రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో జిల్లాలో నిత్యం అపన్నాహస్తంగా ఎందరో దాతలు ముందుకు వచ్చి  ఔదార్యాన్ని చాటుకోవడము విశేషం…ఈ తరుణంలో శుక్రవారం  పొలాస గ్రామంలో నిత్యావసర సరుకుల  పంపిణీ చేశారు. జగిత్యాల రూరల్‌ ‌మండలం పొలాస  గ్రామంలో గ్రామ సర్పంచ్‌ ‌గాజంగి భారతి – నందయ్యల ఆధ్వర్యంలో  సుమారు 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  , ఉప సర్పంచ్‌ ఏంఏ ‌షాహిద్‌ ‌గ్రామపంచాయతీ కో – ఆప్షన్‌ ‌సభ్యుడు లక్ష్మణ్‌, ‌చర్చి ఫాస్టర్‌ ‌డి .వసంత్‌ ‌కుమార్‌, ‌సభ్యులు లచ్చయ్య, కాంతం, బి. జయకర్‌ ఉన్నారు.

నిరుపేదలకు అల్పాహారం పంపిణీ…
పట్టణంలో ని శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి కార్యనిర్వాహక సభ్యుల ఆధ్వర్యంలో భక్త మార్కండేయ దేవాలయం ఆవరణలో సేవా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వలస, పారిశుద్ధ్య కార్మికులు, నిరుపేదలకు 38వ వార్డు కౌన్సిలర్‌ ‌దాసరి లావణ్య -ప్రవీణ్‌ ‌కుమార్‌ ఆర్‌యంపి అందించిన అల్పాహారంను పంపిణీ  చేశారు .ఈ కార్యక్రమంలో భోగ రమేష్‌ – ‌లత పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష , కార్యదర్శులు ఒల్లాల గంగాధర్‌, ‌భోగ చిన్న జీయర్‌ ‌సేవా సమితి కార్యవర్గ సభ్యులు చిలకమారి శ్రీనివాస్‌, ‌కొక్కుల సుదర్శన్‌,ఆకుబత్తిని శ్రీనివాస్‌, ‌మానపురి శ్రీనివాస్‌, ‌పొలాస శంకర్‌, ‌నందగిరి ప్రసాద్‌, ‌చిలుక రాజన్న, భోగ రాజేశం, కోమాకుల సుదర్శన్‌, ఏ ఎస్‌ ‌వాసు, మానాల ఆనందం పాల్గొన్నారు.

1360 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ  
జగిత్యాల మునిసిపాలిటి పరిధిలోని 47,48 వార్డులు తారక రామనగర్‌  ‌కు చెందిన 1360 కుటుంబాలకు నిత్యవసరాల ను పంపిణీ చేశారు వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది కుటుంబాలు ఇక్కడ స్దిరపడగా వారందరికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌ ‌కుమార్‌  ‌నిత్యావసర సరుకులను పంపిణీచేశారు.నిత్యవసర సరుకులను అందించేందుకు ముందుకొచ్చిన దాతలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. పంపిణీలో భాగస్వాములైన స్కౌట్‌ అం‌డ్‌ ‌గైడ్స్ ‌వాలంటీర్లకు, రెవెన్యూ,పోలీస్‌ ‌సిబ్బందికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌చైర్మన్‌  ‌శ్రావణి ప్రవీణ్‌,‌వైస్‌ ‌చైర్మన్‌ ‌శ్రీనివాస్‌,‌జిల్లా యూత్‌ అధ్యక్షుడు దావసురేష్‌,‌కౌన్సిలర్‌ ‌చాంద్‌ ‌పాష,డా.శైలెందర్‌ ‌రెడ్డి,డా. రామక్రిష్ణ, చిట్ల రమణ,కొండశ్రీను,నాగేశ్వర్‌ ‌రావ్‌,‌శ్రీధర్‌ ‌రావ్‌,‌జమున రాణి,విఘ్నేష్‌,‌హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!