Take a fresh look at your lifestyle.

దాతలకు వనదేవతల అశీస్సులు : సీతక్క

కరోనా మహమ్మారీ విజృంబిస్తున్న సమయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఆమలు చేస్తుండగా నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్న విషయాన్ని గమనించి వారి ఆకలి తీర్చడం కోసం తాను ఇచ్చిన పిలుపు మేరకు దాతలు స్పందించి ముందుకు వచ్చి సహకారం అందించిన వారికి,వారి కుటుంబ సభ్యులకు వనదేవతలైన శ్రీ సమ్మక్క-సారలమ్మల అశీస్సులు ఎప్పటికి ఉంటాయని ములుగు ఎమ్మేల్యే సీతక్క అన్నారు. సోమవారం ములుగు ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్‌కు చెందిన శివ ములుగు ప్రాంత ప్రజల ఆకలి తీర్చడం కోసం దాదాపు ఒక వెయ్యి మందికి సరిపడ కూరగాయలను ములుగు ఎమ్మేల్యే సీతక్కకు ఆందించారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ‌సమయంలో పేద ప్రజల ఆకలీ తీర్చడం కోసం జిల్లాలోని అన్ని మండలాలలో తిరిగి నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి కొంతలో కోంత ఆకలి తీర్చడం జరుగుతుందన్నారు.దీనికై తాను ఇచ్చిన పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుండి దాతలు వచ్చి తనకు వారికి తోచిన విధంగా అర్ధిక సహయం అందిచండం జరుగుతుందని, వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. వారికి ములుగు ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.అనంతరం నియోజకవర్గంలోని కోత్తగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల నేపద్యంలో తరగతి గదిలో స్కూల్‌ ‌పరిసరాలను కరోనా నేపద్యంలో సానిటైజర్‌, ‌బ్టీచింగ్‌ను స్వయంగా పిచికారి చేశారు.

మండల కేంద్రానికి చెందిన గట్టి వెంకన్న ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను పరమార్శించి వారికి ఆర్ధిక సహయం అందించారు. ఈ సందర్బంగా ములుగు ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కేంద్రానికి చెందిన మైనార్టీ సోదరులు గత 69 రోజులుగా జిల్లా అంతటా తిరుగుతూ పేద ప్రజల ఆకతి తీర్చుతున్న సీతక్కను, జిల్లా అద్యక్షులు నల్లేల కుమారస్వామిని ఘనంగా శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అద్యక్షులు నల్లేల కుమారస్వామి, మాజీ జడ్పీటిసి బోల్లు దేవెందర్‌,ఆక రాధాకృష్ణ, మండల అద్యక్షులు మైల జయరాంరెడ్డి,ఆర్రెం లచ్చుపటేల్‌, ‌యూత్‌ ఆద్యక్షులు బానోత్‌ ‌రవిచందర్‌, ‌నాగేశ్వర్‌రావు,కుతుబుద్దీన్‌,‌సర్వర్‌ ‌హజీ, కోత్తగూడ వర్కింగ్‌ ‌కమిటి అద్యక్షులు సుంకరబోయిన మొగిలి, సారయ్య, ఎంపిపి విజయరూప్‌సింగ్‌,‌జడ్పీటిసి పులుసం పుష్పలత-శ్రీనివాస్‌, ‌కో అప్షన్‌ ‌సభ్యులు సయ్యద్‌, ‌ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్‌, ‌స్థానిక సర్పంచ్‌ ‌రణదీర్‌ ‌తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply