Take a fresh look at your lifestyle.

కొరోనాపై పోరుకు విరాళాలు

  • విరాళం ఇచ్చిన వారిని అభినందించిన మంత్రి
  • సామాజిక స్ఫూర్తితో.. మరింత మంది రావాలని పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌రావు

కరోనా కట్టడికి, లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల సహాయార్థం సిద్ధిపేట జిల్లాలో పలువురు తమవంతు సాయంగా విరాళాలందించడం సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు పేదలను ఆదుకునేందుకు ముందుకు రాగా., మరింత మంది భాగస్వామ్యం కావాలని మంత్రి హరీశ్‌ ‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సిద్ధిపేట జిల్లాలోని మంత్రి నివాసంలో పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల చెక్కును మంత్రి హరీశ్‌ ‌రావుకు అందించారు. వీరిలో..

ఎన్‌ఆర్‌ఐ ‌తరుణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రూ.50 వేలు విరాళం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ‌నియంత్రణ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా పలువురు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనాపై పోరులో భాగంగా దాతలు సీఏం కేర్‌ ‌ఫండ్‌కు విరాళాలు పంపాలని మంత్రి హరీశ్‌ ‌రావు పిలుపు మేరకు సిద్ధిపేట జిల్లా వర్గల్‌ ‌మండలం మత్త మైలారం గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ ‌తరుణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రూ.50 వేలు సాయాన్ని చెక్కు రూపేణా అందించారు. టెక్సాస్‌ ‌లోని హాస్టన్‌ ‌యూనివర్సిటీలో పీహెచ్డీ 4వ సంవత్సరం చేస్తూ తెలంగాణలో కరోనా వైరస్‌ ‌నియంత్రణ కోసం ప్రభుత్వానికి తన వంతు సాయంగా అందించడం హర్షించదగిన విషయమని తరుణ్‌ ‌ను మంత్రి అభినందించారు.

డాక్టర్‌ ‌రమాదేవి, రాంచందర్‌ ‌రావు దంపతులు ఔదార్యం
కరోనా వ్యాధి నివారణకు సిద్ధిపేటకు చెందిన ప్రముఖ డాక్టర్‌ ‌రమాదేవి, రాంచందర్‌ ‌రావు దంపతులు తమ ఔదార్యాన్ని చాటి చెప్పారు. మంత్రి హరీశ్‌ ‌రావు పిలుపు మేరకు కరోనా వ్యాధి నివారణకు, లాక్‌ ‌డౌన్‌ ‌సందర్బంగా పేదల సాయంగా రూ.1 లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ మేరకు సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో చెక్కును మంత్రికి అందజేయగా డాక్టర్‌ ‌దంపతులను మంత్రి అభినందిస్తూ వారికి థాంక్స్ ‌చెప్పారు.

ఎస్వీఎస్‌ఎస్టీ ఆధ్వర్యంలో రూ. 3 లక్షల 26వేల 192 రూపాయలు
ఎస్వీఎస్‌ఎస్టీ – శ్రీ విద్యా సరస్వతీ, శ్రీ శని దేవాలయాల మానిటరింగ్‌ ‌కమిటీ రూ.లక్షా 11వేల 116 రూపాయలు, ఎస్వీఎస్‌ఎస్టీ ఉద్యోగులు లక్షా 80వేల 328 రూపాయలు, ఎస్వీఎస్‌ఎస్టీ సిబ్బంది రూ.34 వేల 748 రూపాయల చెక్కులను సీఏంఆర్‌ఎఫ్‌ ‌కు అందివ్వాలని మంత్రికి అందజేశారు.

సిద్ధిపేట ఎలక్ట్రికల్‌ ‌యూత్‌ అసోసియేషన్‌ ‌క్లబ్‌ ఆధ్వర్యంలో రూ.30వేల రూపాయలు
సిద్ధిపేట ఎలక్ట్రికల్‌ ‌యూత్‌ అసోసియేషన్‌ ‌క్లబ్‌ ఆధ్వర్యంలో కరోనా బాధితుల సాయం కోసం తమ వంతు బాధ్యతగా రూ.30వేల రూపాయల చెక్కును మంత్రి హరీశ్‌ ‌రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జిల్లా సతీష్‌ ‌కుమార్‌, ‌పెద్ది మల్లికార్జున్‌ , ‌నాయకం వెంకటేష్‌, ‌తోడుపు నూరి చంద్రం, మచ్చేందర్‌, ‌కాచం కృష్ణ, రాజు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

సిద్ధిపేట పెట్రోల్‌ ‌బంకు డీలర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూ. 1లక్షా 50వేల రూపాయలు
సిద్ధిపేట పెట్రోల్‌ ‌బంకు డీలర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కరోనా బాధితుల సాయం కోసం తమ వంతు బాధ్యతగా రూ. లక్షా 50 వేల రూపాయల చెక్కును మంత్రి హరీశ్‌ ‌రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్‌ ‌బంకు అసోసియేషన్‌ అధ్యక్షులు చేర్యాల సురేశ్‌, ‌కార్యదర్శి రేఖా శ్రీధర్‌, ఉపాధ్యక్షులు రాజ నరేందర్‌, ఆరేటి రమేశ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

కాచం కృష్ణ ఆధ్వర్యంలో రూ.10వేలు
సిద్ధిపేటకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కాచం కృష్ణ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5వేల రూపాయల చెక్కును మంత్రి హరీశ్‌ ‌రావుకు, అదే విధంగా అహర్నిశలు ప్రజా శేయస్సుకై శ్రమిస్తున్న సిద్ధిపేట వన్‌ ‌టౌన్‌ ‌పోలీసులకు ఉడుతా భక్తి సాయంగా రూ.5వేల రూపాయల చెక్కును వన్‌ ‌టౌన్‌ ‌సీఐ సైదులుకు అందజేశారు. ఈ సందర్భంగా కరోనా వ్యాధి నివారణకు పేదల సంక్షేమానికి ముందుకు రావడం పట్ల మంత్రి అభినందనలు తెలిపి వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

Leave a Reply