Take a fresh look at your lifestyle.

‌సిఎం సహాయనిధికి అందుతున్న విరాళాలు

  • కెటిఆర్‌కు పదిలక్షల విరాళం అందించిన జడ్పీ ఛైర్‌పర్సన్‌

కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడేందుకు పలువురు శనివారం విరాళాలు అందించారు. కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తమవంతు సహాయంగా సూర్యాపేట జడ్పీ చైర్‌పర్సన్‌ ‌దంపతులు రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో నేడు మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్‌ ‌చైర్మన్‌ ‌గుజ్జ దీపికా, యుగంధర్‌రావు మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో చెక్కును ప్రభుత్వానికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు తమవంతు చేయూతగా ఈ నగదును అందజేసినట్లు ఈ సందర్భంగా దంపతులు తెలిపారు. దంపతుల ఉదారతను మంత్రులు కేటీఆర్‌, ‌జగదీష్‌ ‌రెడ్డి అభినందించారు.

వరంగల్‌ ‌నర్సంపేటలోని కరని స్పైసెస్‌ ‌ముఖ్యమంత్రి సహాయ నిధికి 2లక్షల 11వేల రూపాయల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు ప్రతిగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌కు అందించారు. వరంగల్‌లోని నెల్లికుదురు మండల వావిలాల గ్రామ సర్పంచ్‌ ‌గంటా పద్మభాస్కర్‌ ‌ముఖ్యమంత్రి సహాయ నిధికి 50వేల రూపాయలు విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. వరంగల్‌ ‌జిల్లా పరకాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు ప్రసన్నరాణి, రమాదేవి, కవిత 10వేల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.అంగన్‌వాడీలో పనిచేసే ఆయా బాలోజి లక్ష్మి 3వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంత్రి కేటీఆర్‌కు అందించారు.

Leave a Reply