వచ్చే ఏడాది ప్రారంభానికి భారత దేశానికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పలు సంస్థల నుంచి దేశంలో టీకా అందుబాటులో ఉండొచ్చని అన్నారు. నిపుణుల బృందాలు టీకా పంపిణీకి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ..దేశంలో కొరోనా వ్యాక్సిన్ను ఎలా పంపిణీ చేయాలన్న కార్యాచరణ ప్రణాళికను నిపుణులు తయారు చేస్తున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. టీకాలను ముందుగా ఎవరికి ఇవ్వాలి, టీకాలను భద్రపరిచేందుకు కోల్ట్ చైన్ ఫెసిలిటీలను బలోపేతం చేస్తున్నట్లు హర్షవర్ధన్ తెలిపారు.