Take a fresh look at your lifestyle.

ముస్లీంలకు పలువురి చేయూత

ఖమ్మం సిటి, మే 23 (ప్రజాతంత్ర విలేకరి) : రంజాన్‌ ‌పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కార్పోరేషన్‌ ‌పరిధిలో 5వేల మంది పేద ముస్లిం కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన కిట్స్‌ను  సతీమణి పువ్వాడ వసంతలక్ష్మీ తో కలసి రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌తోఫా రూపంలో పండుగ కానుకగా పంపిణీ చేసారు. లాక్‌డౌన్‌లో రంజాన్‌ ‌పర్వదినానికి పేద  ముస్లిం సోదరులకు బాసటగా పువ్వాడ ఫౌండేషన్‌ ‌నిలిచిందన్నారు. గత నెల 19న తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండి కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఉండాలనే అకాంక్షతో కార్పోరేషన్‌లో 10వేల పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన విషయం  విదితమే. మే 1న కార్మిక దినోత్సవం సందర్బంగా వివిధ రంగాల కార్మికులకు 5వేలమందికి నిత్యావసర సరుకులు అందజేసారు. తాజాగా రంజాన్‌ ‌పండుగను అందరూ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో సొంతనిధులతో 5వేల మందికి డ్రైపూట్స్‌తో సహా పది రకాల నిత్యావసరాల సరుకులు ప్రతి ముస్లిం కుటుంబానికి శనివారం వివిధ డివిజన్లలో సతీమణి వసంతలక్ష్మీతో కలసి అందజేసారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్‌ ‌డాక్టర్‌ ‌గుగులోతు పాపాలాల్‌, ‌జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌లింగాల కమల్‌రాజ్‌, ఎంఎల్‌సి బాలసాని )క్ష్మీనారాయణ, కార్పోరేటర్లు,డివిజన్‌ ‌నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ‌మైనార్టీ ఆధ్వర్యంలో …
ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ ‌మైనార్టి అధ్యక్షులు మహ్మద్‌ ‌తాజుద్దీన్‌ ఆధ్వర్యంలో ఖమ్మంనగరంలోని 20.27.31 డివిజన్లలో సుమారు 100 మంది ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్‌ ‌కిట్లు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కరోనా కారణంగా ఖమ్మం నగరంలోని కుటుంబాలన్నీ ఉపాధి కోల్పోయారని, ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్‌ ‌పండుగ జరుపుకోవాలని 100 మందికి రంజా న్‌ ‌కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు.ఈ సందర్బంగా ఖమ్మంనగరంలోని ముస్లింలకు ఆయన రంజాన్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్‌ ‌కాంగ్రెస్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రధానకార్యదర్శి అబ్దుల్‌ ‌వహీద్‌, 20‌వ డివిజన్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు షేక్‌ అబ్బా స్‌, ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ఎం‌డి ఫరూఖ్‌, ‌సాయికుమా ర్‌,అర్పాజ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

సత్తుపల్లిలో…
ఖమ్మం అర్బన్‌, ‌మే 23, (ప్రజాతంత్ర విలేకరి) : ముస్లిం సోదరులకు సత్తుపల్లి శాసనసబ్యులు సండ్ర వెంకటవీరయ్య శనివారం రంజాన్‌ ‌కిట్లు పంపిణీ చేసా రు. లాక్‌డౌన్‌ ‌ప్రారంభం నుండి తనదైనశైలీలో వివిధ రూపాలలో ప్రజలకు సేవచేస్తున్న ఆయన తాజాగా నియోజకవర్గ పరిధిలో 5వేల నిరుపేద ముస్లింలకు చేయూతగా ఉండాలనే లక్ష్యంతో నిరుపేద ముస్లింలను గుర్తించి ప్రతి రోజు వారికి రంజాన్‌ ‌కిట్లును అందజేస్తు న్నారు. దానిలో భాగంగా శనివారం సత్తుపల్లి మండలం లోని నిరుపేద ముస్లిం కుటుంబాకు జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ ‌చేతుల మీదుగా వీటిని పంపిణీ చేసారు. బియ్యం, పంచదార, సేమియా ప్యాకెట్‌, ‌జీడిపప్పు, కిస్మస్‌,‌పండ్లు, డాల్డానూనె తదితర వస్తువులను అందజేసారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేనివిధంగా సత్తుపల్లి ఎంఎల్‌ఏ ‌నిరుపేద ముస్లింలను గుర్తించి పండుగరోజు సంతోషంగా గడిపేలా చేస్తున్నం దుకు దైవంతోపాటు ప్రజల ఆశీస్సులు కూడా ఉంటాయన్నారు.ఆయన్ను స్పూర్తిగా తీసుకుని మరికొంత మంది ఇలాంటి సేవాకార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిం చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించినవారికి వెంకటవీరయ్య ధన్యవాదాలు తెలిపారు.

చిరువ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో
ఖమ్మం నగరంలోని శ్రీవాసవీ చిరువ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో కరోనా, లాక్‌డౌన్‌ ‌నేపధ్యంలో శనివారం ఉపాధిలేక నిరాశ్రయులైన 50 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ ‌పండుగ సందర్బంగా రంజాన్‌ ‌సామాగ్రిని పంపిణి చేసారు. ఆ సంఘ అధ్యక్షులు మిట్టపల్లి రవి మానవత్వంతో స్పందించి నిరుపేద ముస్లింలకు సేమియా, పంచదార, గోదుమపిండి,  సబ్బులు కలిగిన కిట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో ఆ సంఘ ప్రధానకార్యదర్శి నోముల లక్ష్మీనారాయణ, కోశాధికారి కనికిచర్ల లక్ష్మణ్‌, ‌హైద్రాబాద్‌ ‌వాసవీ ట్రస్ట్ ‌రాయపూడి రమేష్‌, ‌మామిడి నారాయణ గురుభవాని, మహిళా కమిటి సబ్యులు తదితరులు పాల్గొన్నారు.

కారేపల్లిలో…
కారేపల్లి, మే 23, (ప్రజాతంత్ర విలేకరి) : సింగరేణి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ 10వ వార్డు సబ్యులు మండల మైనార్టీ సెల్‌ అధ్యక్షులు ఎస్‌కె గౌసుద్దీన్‌ 120 ‌నిరుపేద ముస్లిం కుటుంబాలకు శనివారం సేమియా ప్యాకెట్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్‌ ‌మణికొండ నాగేశ్వరరావు, వార్డు సబ్యులు గంగరబోయిన సత్యనారాయణ, తారిక రమేష్‌,  ‌రేషన్‌ ‌డీలర్‌ ‌పాషా, జాకీర్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply