Take a fresh look at your lifestyle.

పేదప్రజల జీవితాలంటే లెక్కలేదా..?

పాతమ్యాప్‌ అడిగినా చూపించకపోవడంలో ఆంతర్యం ఏంటి…?
జాతీయ బిసి కమిషన్‌సభ్యులు డి ఆచారి

నాగర్‌కర్నూల్‌, ‌సెప్టంబర్‌ 28. ‌ప్రజాతంత్ర విలేకరి: పేదప్రజల జీవితాలు అంటే అదికార పార్టీ నాయకులకు లెక్కలేదా అని జాతీయ బిసి కమిషన్‌ ‌సభ్యులు డి ఆచారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెరువు పాతమ్యాప్‌ అడిగినా చూపించకపోవడంలో ఆంతర్యం ఏంటి అని జాతీయ బిసి కమిషన్‌ ‌ప్రశ్నించింది. మూడుసార్లు జాతీయ కమిషన్‌ ‌గెలిచినా, నాలుగోసారి షోకాజ్‌ ‌నోటిసు ఇచ్చినా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం కారణం ఏంటని సూటిగా ప్రశ్నించినా జాతీయ కమిషన్‌. ‌

కేసరిససముద్రం స్థాయికి మించి నీటిని నిల్వ ఉంచడంతో భూములు మునిగిపోయిన ఉయ్యలవాడ, ఎండబెట్ల, చర్లతిరుమలాపూర్‌, ‌నాగనూల్‌ ‌గ్రామాల రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసారు. రాజకీయ నాయకులకు అనుగుణంగా కేసరి సముద్రం చెరువు మ్యాపును రూపకల్పన చేయడంలో మీ వాటా ఎంత? రైతులు నీటిపారుదల శాఖ అధికారుల తీరవల్లే మా పంటపొలాలు మునిగాయని జాతీయ కమిషన్‌ ‌ముందు వేడుకున్నారు. ఈ సమావేశానికి జాయింట్‌కలెక్టర్‌ ‌హనుమంతురెడ్డి, ఈఈ మురళి, డిఈ రమేష్‌, ఆర్డిఓ నాగలక్ష్మి, సర్వేయర్‌ ‌శ్రీనివాస్‌రెడ్డి, బిసి కమిషన్‌ ‌ముందు హాజరైనారు. ఈ కమిషన్‌ ‌ముందు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని తమ గొడు వెలిబుచ్చుకున్నారు. రైతుల పక్షాన బిజేపి నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ ఇంచార్జి నెడనూరి దిలీపాచారి పాల్గొన్నారు.

Leave a Reply