Take a fresh look at your lifestyle.

కేంద్రం ప్యాకేజీతో పేదవర్గాలకు సాయం అందేనా?

కోవిడ్‌ -19‌ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా ఉపాధి కోల్పోయేవారి కోసమని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌లక్షా 70 వేల కోట్ల రూపాయిల ప్యాకేజీని ప్రకటించారు. ఆ ప్యాకేజీలో పేదల కోసం ఎంత కేటాయించారన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం రావడం లేదు. నిజానికి ఈ లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల ఎక్కువగా నష్టపోతున్నది దినసరి వేతన కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులే. ఈ ప్యాకేజీని వచ్చే మూడు మాసాల్లో ఖర్చు చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ ప్యాకేజీని లోతుగా పరిశీలిస్తే దీనిని అందుకునేది మూడు వర్గాలుగా కనిపిస్తోంది. ముఖ్యంగా వలస కార్మికులకు ఆర్థిక సాయం అందించడానికని ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఇందులో వలస కార్మికులు లేదా లాక్‌ ‌డౌన్‌ ‌బాధితులకోసమని ఎక్కడా కేటాయింపులు లేవు. ఈ ప్యాకేజీ సొమ్ములో 60,000 కోట్లు నగదు బదిలీ కోసం వినియోగిస్తారు. నిజానికి ప్రస్తుతం అమలులో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌కోసమేనని స్పష్టం అవుతోంది.

రాష్ట్రాలు ఇప్పటికే వివిధ పథకాలకు వినియోగిస్తున్న సొమ్మును సర్దుబాటు చేయడం కూడా ఈ ప్యాకేజీలో చేరి ఉంది. ప్యాకేజీకి సంబంధించి తొలి వివరణలో ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌కి 16000 కోట్లు ఖర్చు చేస్తారని పేర్కొనడం జరిగింది. కానీ, అది 17,000 కోట్ల కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కేంద్రం అదనంగా మూడు రంగాలకే ప్యాకేజీ నుంచి కేటాయింపులు జరపవచ్చు. ఈ ప్యాకేజీ వల్ల కోవిడ్‌ -19 ‌వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి వెంటనే ప్రయోజనం కలగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అమలులో ఉన్న పథకాల కేటాయింపులను ఇందులో చేర్చారు. దినసరి వేతన పొందేవారిని, నిర్మాణ రంగంలో పని వారిని పూర్తిగా వదిలి వేశారు. భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికుల కోసం విధించే సెస్‌ ‌కింద ప్రభుత్వానికి 52,000 కోట్లు ఆదాయం వస్తోంది. ఇందులో 31 వేల కోట్లు ఖర్చు చేయలేదు. ఈ కార్మికుల్లో 30 నుంచి 40 శాతం కార్మికులకు ప్రయోజనం జరగకపోవచ్చు. అయితే, రిజిస్ట్రర్డ్ ‌కార్మికులు 3.5 కోట్లు ఉన్నారనీ మంత్రి పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ అధికార వెబ్‌ ‌సైట్లలో వీరి సంఖ్య 5.1 కోట్లు. నిర్మాణ రంగంలో పని చేసే కార్మికుల సంఖ్యే ఎక్కువని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. దేశంలో నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులు 6 కోట్ల మంది వరకూ ఉంటారు. కానీ, 3.5 కోట్ల మంది మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అంటే మిగిలిన వారి సంగతి ఏమిటని కేంద్ర టేడ్‌ ‌యూనియన్‌ ‌సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

జై కిసాన్‌:
‌పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌కింద 8.69 కోట్ల మంది రైతులకు రెండువేల చొప్పున వెంటనే చెల్లిస్తామని నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించారు. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, వారందరికీ సాయం అందించాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌కింద రెండు బడ్జెట్‌లలో 95 వేల కోట్లు మాత్రమే కేటాయించగా, 56 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, యూనియన్‌ ‌నాయకులు చెబుతుండగా, మొదటి సంవత్సరంలో చెల్లింపుల్లో కొన్ని జరగలేదని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు మొదటి విడత చెల్లింపులు జరగలేదని స్వపన్‌ ‌దాస్‌ ‌గుప్తా పేర్కొన్నారు.

పిఎం కిసాన్‌కి కేటాయించిన 40 వేల కోట్లు ఖర్చు జరగలేదని ఆయన వాదిస్తున్నారు. ఉపాధి హామీ పథకానికీ, ఇతర సంక్షేమ పథకాలకు కేటాయించినవి ఈ ప్యాకేజీలో చూపించారనీ, కొత్తగా ఇచ్చిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. జన్‌ ‌ధన్‌లో ఖాతాలు లేని వారికి సాయం అందే అవకాశం లేదనీ, ఉపాధి హామీ పథకంలో సామాజిక దూరాన్ని పాటించాలన్న కోవిడ్‌ ‌మార్గ దర్శకాల్లో పేర్కొన్నందున ఈ కార్యక్రమం కింద పనులు జరుగుతాయా, రైతు కూలీలకు ఉపాధి హామీ వేతనాలు లభిస్తాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం గురించి ఆర్థిక మంత్రి ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు. నిలిచి పోయిన వేతనాలను మాత్రం ఏప్రిల్‌ 10‌వ తేదీన విడుదల చేస్తామన్నారు. నిలిచిపోయిన వేతనాలు 18 వందల కోట్ల వరకూ ఉన్నాయి. మొత్తం మీద కోవిడ్‌ -19 ‌ప్రభావం వల్ల కార్మికులు, అల్ప ఆదాయ వర్గాలకు ప్రకటించిన ప్యాకేజీలో ఎటువంటి సాయం అందే అవకాశాలు కనిపించడం లేదు.
– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply