Take a fresh look at your lifestyle.

పారా బాయిల్డ్ ‌రైస్‌ను సేకరించేది లేదు

  • గతంలోనే తెలంగాణకు ఈ విషయం తేల్చిచెప్పాం
  • ఇందుకు అప్పుడే అంగీకరించింది
  • యాసంగి ధాన్యం కూడా పరిమితంగానే కొంటాం
  • ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలి
  • స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

పారా బాయిల్డ్ ‌రైస్‌ను తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. గతంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయం స్పష్టం చేశామని, ఆ ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక యాసంగి పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని పేర్కొంది. రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత వొచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.

ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్‌ ఒక్కో విధంగా ఉంటుందని, డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని, ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం బాయిల్డ్ ‌రైస్‌ ‌కేంద్రం కొనదని తెలిపింది. వరి, గోధుమ పంటను తక్కువ పండించాలని రాష్ట్రాలను కోరుతున్నామని, ప్రస్తుతం..దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయని, అవకాశం ఉన్నంత మేరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని పేర్కొంది. పంజాబ్‌లో కూడా గోధుమలతో పాటు వరి కూడా పండిస్తున్నారని అన్నారు. అయితే పారా బాయిల్సడ్‌ ‌రైసు వాడకం దేశంలో తగ్గిందని కూడా తెలిపింది.

అందుకే రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచనలు చేస్తున్నామని, ఆయిల్‌, ‌పప్పు ధాన్యాలు ఎక్కువ పండించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నామని, రాష్ట్రాలు ఎంత వరకు సేకరించగలుగుతాయో అంత వరకే పరిమితం కావాలని చెబుతున్నాని పేర్కొంటూ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ సీఎం కేసీఆర్‌ ‌మహాధర్నా చేస్తున్న రోజే కేంద్రం ఇలా కౌంటర్‌ ఇవ్వడం సంచలనంగా మారింది.

Leave a Reply