Take a fresh look at your lifestyle.

డిల్లీ లోనూ గుజరాత్‌ ‌పాలనేనా? తీరు మారని మోదీ, షా !

“గతంలో కొందరు ప్రధాన మంత్రులు అంచలంచెలుగా కొన్ని విధానాలు అమలుజేసినా  గంపగుత్తగా ఏకమొత్తంగా రుద్దేందుకు ఎవరూ ఇంతగా ఎవరూ సాహసించలేదు. ఇందిరా గాంధి అత్యయిక పరిస్థితుల్లో మాత్రమే దిల్లి నగరం ఇలాంటి రుచులు జనం రుచిచూసింది. మోది- షా ద్వయం తమ ప్రత్యేక తరహా పాలన ఎలా ఉంటుందో దిల్లీ ప్రజలకు దేశానికి చవిచూపిస్తున్నారు. గతంలో కొందరు ముఖ్యమంత్రులు తమ ఆధిపత్యం ఎలా ప్రదర్శించారో  గుర్తు చేసుకుంటే…”

(రామలక్ష్మి)

ఆయన తాను భారత దేశానికి ప్రధాని అని అనుకోకుండా  ఇంకా ముఖ్యమంత్రినేనని,  మరొకాయనేమో తాను దేశానికి కాక, రాష్ట్ర హోం మంత్రిగానే భావిస్తున్నట్లు కనబడుతున్నది. గిరిగీసుకున్న గాంధినగర్‌ ‌రాజకీయాలను దిల్లీలో సాగిస్తూ ఆ జంత నేతలు మురిసిపోతున్నారా.. అని అనుమానమొస్తుంది ఎవరికైనా మోదీ, అమిత్‌ ‌షా  తీరు చూస్తే, వారిరువురూ వ్యవహరించే విధానం గమనిస్తే గుజరాత్‌ ‌పాలన నిరంకుశ ధోరణినే దిల్లీలో అమలుచేస్తున్నట్లు ఎవరు భావించినా తప్పులేదు.

దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల నిరసన గళాలు వినపదగానే ఇంటెర్‌ ‌నెట్‌ ‌సౌకర్యం తొలగించడం,  రోడ్లపై మేకులు దించడం, అధిక సంఖ్యలో పోలీసు, పారా మిలిటరి బలగాలను మోహరించడం, నిరసన అణచివేత వ్యూహంలో భాగంగా వాస్తవాలు బయటకు రాకుండా పాత్రికేయులను అదుపులోకి తీసుకోవడం, కేసులు నమోదు చేయడం, విపక్షాలను తూలనాదడం, విమర్శకులను, నిరసనకారుల గళం  వినిపించకుండా తొక్కివేయడం… ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి తరహా పాలనను  స్ఫురింపజేస్తున్నాయి. ఇన్నేళ్ళు రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాలు ఇప్పుడు నేరుగా దిల్లీ చేరుకున్నాయనడంలో అనుమానమేమీ లేదు. రాష్ట్రాల్లో వాతావరనం పెద్దగా పట్టించుకోని వార్తా వీశ్లేషకులకు 2014 నుంచీ దిల్లీలో మోదీ అమలుచేస్తున్న గుజరాత్‌ ‌తరహా విధానాలు చూస్తుంటే అతిపెద్ద ప్రజస్వామ్యదేశంలో ప్రజవ్యతిరేక రాక్షస పాలన ఎలా సాగుతున్నదో తెలిసి నోట మాట రావడం లేదట.

గతంలో కొందరు ప్రధాన మంత్రులు అంచలంచెలుగా కొన్ని విధానాలు అమలుజేసినా  గంపగుత్తగా ఏకమొత్తంగా రుద్దేందుకు ఎవరూ ఇంతగా ఎవరూ సాహసించలేదు. ఇందిరా గాంధి అత్యయిక పరిస్థితుల్లో మాత్రమే దిల్లి నగరం ఇలాంటి రుచులు జనం రుచిచూసింది. మోది- షా ద్వయం తమ ప్రత్యేక తరహా పాలన ఎలా ఉంటుందో దిల్లీ ప్రజలకు దేశానికి చవిచూపిస్తున్నారు. గతంలో కొందరు ముఖ్యమంత్రులు తమ ఆధిపత్యం ఎలా ప్రదర్శించారో  గుర్తు చేసుకుంటే…

తమిళనాడులో జయలలిత హయాంలో పార్టీ కార్యకర్తల ముసుగులో పత్రికా కార్యాలయాలను ధ్వంసం చేయడం, విమర్శకులపై యాసిడ్‌ ‌దాడులు జరపదం, ప్రభుత్వ ద్రోహులుగా చిత్రీకరించి కేసులు పెట్టడం, అధికారులు ఆమెకు  దాసోహమంటూ వాస్తవ విరుద్ధ అంకెలతో రాష్ట్రం అభివృద్ధిలో అగ్రస్థానాన ఉన్నట్లు గారడి చేయడం గుర్తుకొస్తాయి. అలాగే పంజాబ్‌ ‌లో ప్రకాశ్‌ ‌సింగ్‌ ‌బాదల్‌,  ‌ప్రభుత్వ విమర్శకుల ఫోన్లపై నిఘా ఉంచి, తమను వ్యతిరేకించినవ్యక్తులపై ఖలిస్తాన్‌ ‌వాదులుగా ముద్రవేసి యు ఎ పి ఎ చట్టం ప్రయోగించడం, ప్రభుత్వ వ్యతిరేక సమాచారం ప్రసారం కాకుండా చేబుల్‌ ‌నిర్వాహకులపై కేసులు బనాయించడం, అనుకూల వర్గాలను ప్రోత్సహించడం కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తాయి.

- Advertisement -

తనను, ప్రభుత్వాన్ని విమర్శిన్సి ప్రశ్నించే వర్గాలపై నక్సలైట్ల ముద్రవేసి బెయిల్‌ ‌కూడా లభించకుండా నిర్బంధించి హింసించిన ఒరిస్సా  ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌ ‌కూడా గుర్తొస్తారు. కార్టూన్‌ ‌ను మెయిల్‌ ‌చేసి ఉద్రిక్తత రెచ్చగొట్టారన్న అభియోగంపై యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ‌ను నిర్బంధించి, వ్యతిరేక పత్రికా సంస్థలపై కక్షపూరితంగా వ్యవహరించి, అభ్యంతరకర  సమాచారం పంచుకున్న నేరారోపణపై బిజెపి నాయకుని జైలు పాలు జేసిన పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమత బెనర్జీ మదిలో మెలుగుతారు. అదే మాదిరి దశాబ్దాల పాటు అధికారంలో సాగి గ్రామాలలో హింసాకాండ సృష్టించిన వామపక్ష ప్రభుత్వాలు, దేశద్రోహం అభియోగంపై   కార్టూనిస్టు అసీం త్రివేదీ ని కటకటాల పాల్జేసిన మహరాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్విరాజ్‌ ‌చౌహాన్‌ ‌కనిపిస్తారు.

తమ స్థానం పదిలం కోసం ఇలాంటి విషయాల్లో ఎవరూ తక్కువ కదు. తనంకు వ్యతిరేకులైన జనాలపై అక్కసు తీచుకునేందుకు బీహార్లో నితిష్‌ ‌కుమార్‌ ‌కూడా సోషల్‌ ‌మీడియాల అభ్యంతరకర పోస్టుల నెపంతో కేసులు పెట్టడానికి, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు చేస్తూ చట్టం రెడీ. ఉత్తరాఖండ్‌ ‌లో నిరసనల ప్రదర్శకులకు పాస్‌ ‌పోర్ట్ ‌రాకుండా చట్టం సిద్ధమైంది. ఎక్కడికక్కడ ఇవి మామూలైపోయి ముఖ్యమంత్రులు తమ స్థానాలు పదిలం చేసుకుంటున్నారు.

ఇక ముఖ్యమంత్రులుగా అధికారంలో ఉండి ప్రధానులుగా ఎదిగిన మొరార్జీ దేశాయ్‌, ‌చరణ్‌ ‌సింగ్‌, ‌విపి సింగ్‌, ‌పివి నరసింహారావు, దేవెగౌడకు భిన్నం మన మోదీ. ఆ అయిదుగురు ప్రధానులు సంపూర్ణ బలం లేని సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహించినా మోదీ మాదిరి అన్ని పార్టీలనూ గుప్పిట పెట్టుకోలేదు, గుజరాత్‌ ‌లో మోదీ మాదిరి దీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా అధికారంలో లేరు కూడా. మోదీ అనుసరించింది మమత, దాదల్‌, ‌జయలలిత బాటే. ప్రధానిగా వ్యవహరించిన మన్‌ ‌మోహన్‌ ‌సింగ్‌, అటల్‌ ‌బిహారి వాజ్‌ ‌పేయీల తీరుకు మోదీ తీరుకు హస్తి మశకాంతర భేదం ఉంది. పదవ షెడ్యూలు (పార్టీ మార్పిడి వ్యతిరేకస్‌ ‌చట్టం) స్పూర్తి తో మూడు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రులు సమర్ధతతో పాలించారు. ఎమ్మెల్యేలు పార్టీ అధినేతలనుకాని, ముఖ్యమంత్రులనుకానీ ప్రశ్నించేందుకు, ఎదురు చెప్పేందుకు, పార్టీ మారేందుకు అవకాశం లేకుండా, సస్పెన్షన్‌ ‌కు వీలు కల్పించడమే కాక, గెలిచిన స్థానం కోల్పోయేలా చట్తం చట్రం బిగించదంతో ఉఖ్య మంత్రులు అపరిమిత అధికారంతో కట్టడిచేసే స్వేచ్ఛ పొంది ఏకఛత్రాధిపత్యంతో వెలిగిపోయారు.

ఈ విస్తృత అధికారాలతో ప్రాంతీయ పార్టీ అధినేతలు సర్వాధికారాలు చేసుకుని విశృంఖలంగా  తయారయ్యారు. ఇక మోదీ – అమిత్‌ ‌షా గతంలో తాము గుజరాత్‌ ‌ను, పలువురు ముఖ్యమంత్రులు రాష్ట్రాలను ఏలినట్లు నిరాఘాటంగా దేశాన్ని ఏలడం మొదలెట్టారు. అయితే ఈ విధానం భారత్‌ ‌లో సాధ్యమా? రాను రాను ముఖ్యమంత్రులు సి ఇ ఓలు గా తయారుకాగా ప్రధాని ఎగ్జిక్యూటివ్‌ ‌ల చైర్‌ ‌పెర్సన్‌ ‌గా రూపాంతరం చెందారు. గతంలో ఆంధ్ర ప్రదెశ్‌ ‌ముఖ్యమంత్రి గా అధికారం చెలాయించిన ఎన్‌ ‌టి రామారావు ఒక అడుగు ముందుకేసి  దేసం రాష్ట్రాల కలయిక అని, రాష్ట్రాలు దేశాన్ని పాలిస్తున్నాయని అందుచతే ‘‘కేంద్రం మిథ్య’’ అని పేర్కొన్నారు. అసలు పాలాధికారాలు, విధులు నిర్వహన రాష్ట్రాలదే కనుక ఎమ్మెల్యేలే ఎంపీల కంటే శక్తిమంతులు అనే స్థాయికి వచ్చింది.

పార్లమెంట్‌ ‌లో అత్యధిక సంఖ్యాఖ బలమున్న పార్టీ నేతలుగా ఇందిరా గాంధి, రాజీవ్‌ ‌గాంధి మాదిరే ఇప్పుడు మోదీ కూడా విశృంఖల ఆధిక్యత కలపార్టీ అధినేతగా ప్రధాని హోదాలో మోదీ ఎదురు లేకుండా పాలన సాగిస్తున్నారు. సంపూర్ణ ఆధిక్యతతో గతంలో గుజరాత్‌ ‌ను ఏలినట్లు ఇప్పుడు దిల్లీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

ది ప్రింట్‌ ‘ ‌సౌజన్యం తో ..

Leave a Reply