Take a fresh look at your lifestyle.

డాక్టర్‌ ఆత్మహత్యాయత్నం సరికాదు: మంత్రి ఈటల

Doctor's suicide attempt is wrong Minister etela

‘గాంధీ’లో తప్పుచేసినవారిని ఉపేక్షించం: మంత్రి ఈటల
గాంధీ ఆస్పత్రిలో పరిణామాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రి విషయంలో తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించ బోమని తేల్చి చెప్పారు. వసంత్‌ ‌డాక్టర్‌ ‌స్థాయిలో ఉండి ఆత్మహత్యాయత్నం చేయడం సరికాదన్నారు. గాంధీ ఆస్పత్రి వివాదాలపై సక్ష నిర్వహిస్తామని మంత్రి ఈటల తెలిపారు. వైద్యశాఖలో కమిటీలు నిరంతరం నివేదికలు ఇస్తున్నాయని తెలిపారు. వైద్యశాఖ నిరంతరం ప్రజల సేవలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కొవిద్‌-19(‌కరోనా వైరస్‌) ‌కేసు నిర్దారణ కాలేదని మంత్రి ఈటెల రాజేందర్‌ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఒక వ్యక్తి ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా పరీక్షలు చేయగా.. వారిలో ఒక్కరికి కూడా వైరస్‌ ఉన్నట్లు నిర్దారణ కాలేదని మంత్రి ఈటెల తెలియజేశారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దనీ.. కొవిద్‌-19‌పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని మంత్రి వెల్లడించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy