Take a fresh look at your lifestyle.

వైద్యుల సేవలు చరిత్రలో నిలుస్తాయి మంత్రి దయాకర్‌రావు

ప్రపంచాన్ని, దేశాన్ని గజగజవణికిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు వైద్యులు అందించే సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని పంచాయితిరాజ్‌, ‌గ్రామాణాభివృధ్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి గ్రీన్‌ ‌సోలార్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్ ఎం‌డీ చలమశెట్టి అనిల్‌ 150‌పీపీఈ కిట్లను విరాళంగా ఇవ్వగా మంత్రి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌కె నిఖిల జెడ్‌పీ చైర్మన్‌ ‌పాగాల సంపత్‌రెడ్డిల చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ఆదాయం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్‌ ‌లాక్‌డౌన్‌ను పొడిగించారన్నారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రతి ఒక్కరు తప్పకుండా జాగ్రత్తలను తీసుకోవాలని, నిత్యావసర సరుకు లకు బయటకు వెళ్లేటపుడు తప్పకుండా మాస్క్‌ల ను ధరించాలన్నారు. ప్రజలందరు కలిసికట్టుగా ఇంటి నుండి బయటకు రాకుండా కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు వైద్యులు ఎంతో శ్రమిస్తున్నారని వారిపై దాడులకు దిగడం సరైంది కాదని, వైద్యులకు ప్రతి ఒక్కరు సహకరించాల న్నారు. కరోనా ఆపత్కాలంలో ఆదుకోవడానికి గొప్ప మనస్సుతో ముందుకు వస్తున్న దాతల సేవలు మరువలేనివని వారందరికి కృతజ్ఞతలను తెలిపారు. గతంలో జనగామ జిల్లాలో రెండు కేసులు పాజిటివ్‌ ‌నమోదుకాగా జిల్లా ప్రజలు పకడ్బందీగా లాక్‌డౌన్‌ను పాటించడంతో రెండు కేసులు కూడా నెగిటివ్‌ ‌రావడంతో ఆదివారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ‌జిల్లా ప్రజలను అభినందించారన్నారు. కరోనా కట్టడి చేయడంలో జిల్లా అధికారుల పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పోకల జమున, వైద్యులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!