Take a fresh look at your lifestyle.

కొరోనా సంక్షోభంలో వైద్యుల సేవలు నిరుపమానం

  • వారు భగవంతుడి ప్రతిరూపాలు
  • విద్యుక్త ధర్మంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు
  • జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ

వైద్యులు భగవంతుడి ప్రతిరూపాలని, మన ప్రాణాలను కాపాడుతున్న దేవుళ్లని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. కొరోనా మహమ్మారి విపత్తు వేళ విశేష సేవలందించిన డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా భారత వైద్య మండలి(ఐఎంఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని వర్చువల్‌గా ప్రసంగించారు. కొరోనా మహమ్మారితో యావత్‌ ‌దేశం పోరాడుతున్న వేళ వైద్యులు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని అభినందించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని, ఈ పోరాటంలో కొంతమంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారని, దేశ ప్రజల కోసం గొప్ప త్యాగం చేసిన వారికి నివాళులర్పిస్తున్నానని, 130కోట్ల మంది భారత ప్రజల తరఫున ప్రతి వైద్యుడికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోదీ తెలిపారు.

స్వాతంత్య్రం తర్వాత కొన్ని దశాబ్దాల పాటు వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైందని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత, ఆరోగ్య, మౌలిక సౌకర్యాల కల్పనకు తోడ్పాటు అందించామని తెలిపారు. కొరోనా తొలి దశ సమయంలో దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ. 15వేల కోట్ల మేర ప్రత్యేక నిధులను కేటాయించినట్లు ప్రధాని చెప్పారు. ఈ ఏడాది ఆరోగ్య రంగానికి బ్జడెట్‌ ‌కేటాయింపులు రెట్టింపు చేశామని, రూ. 50వేల కోట్లతో రుణహావి• పథకం ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా హాస్పిటళ్ల సంఖ్య పెరిగింది. కొత్తగా ఎయిమ్స్‌లు, మెడికల్‌ ‌కళాశాలల నిర్మాణాలు జరుగుతున్నాయి.

వీటి వల్ల మారుమూల ప్రాంతాల్లోని వారు డాక్టర్లు కావాలన్న తమ కలను నిజం చేసుకోగలుగుతున్నారని వెల్లడించారు. వైద్యులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. కొన్ని సమస్యలు, సవాళ్లను ఎదుర్కుంటున్నప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే వైద్య రంగంలో భారత్‌ ‌మెరుగ్గానే ఉందని ప్రధాని వివరించారు. కొరోనా లాంటి క్లిష్ట సమయంలో వైద్యులు ప్రజలకు అపారమైన సేవలందించిన దేశంలోని వైద్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్‌ ‌కారణంగా ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు ప్రధాని తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.

వైరస్‌ ‌రకరకాలుగా మ్యూటేట్‌ అవుతున్నా… వైద్యుల అవగాహన కూడా పెరుగుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఇతర దేశాల కంటే భారత్‌ ‌వైరస్‌తో చాలా వేగంగా పోరాటం సలిపిందని, ఇతర దేశాల పాజిటివిటీ రేటు, మరణాలను గమనిస్తే మనం చాలా బెటర్‌ అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వైద్య రంగంపై అధికంగా కృషి సలుపుతోందని, గతంలో 15 వేల కోట్లను కేటాయించిందని, ఈ సారి రెండు లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మోదీ గుర్తు చేశారు.

Leave a Reply