Take a fresh look at your lifestyle.

వైద్యులు అప్రమత్తంగా ఉండాలి ..!

  • కోవిడ్‌తో పాటు బ్లాక్‌ ‌ఫంగస్‌తో పోరాడాలి
  • వారణాసి వైద్యులతో మోడీ వర్చువల్‌ ‌‌సమావేశం
  • కొత్తగా 2,59,591 కొరోనా కేసులు నమోదు
  • దేశంలో మరో 4,209 మంది కొరోనాతో మృతి

న్యూఢిల్లీ,మే21: కొవిడ్‌-19 ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన పార్లమెంట్‌ ‌నియోజకవర్గం వారణాసికి చెందిన డాక్టర్లు, పారా మెడికల్‌ ‌సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు .

కొవిడ్‌-19‌తో పాటు ప్రధాన సవాల్‌ ‌గా ముందుకొచ్చిన బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని కోరారు. కొరోనా మహమ్మారి సమసిపోయేవరకూ ప్రజలు సేదతీరరాదని స్పష్టం చేశారు. కొవిడ్‌-19‌పై మనం పోరాడుతుండగానే బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌రూపంలో మరో సవాల్‌ ఎదురైందని దీన్ని సమర్ధంగా ఎదుర్కొనేందుకు మనం జాగ్రత్తలు పాటిస్తూ సంసిద్ధం కావాలని అన్నారు. కొరోనా• కట్టడిలో వారణాసి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవలను ప్రధాని ప్రశంసించారు. తక్కువ సమయంలోనే నగరంలో ఆక్సిజన్‌ ‌పడకలు, ఐసీయూ పడకలను పెద్ద సంఖ్యలో విస్తరించారని కొనియాడారు.

వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌ ‌సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. కాగా, ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్‌ ‌మహమ్మారి సమయంలో వారు చేస్తున్న ధైర్యసాహసాలను కృషిని అభినందించారు. కోవిడ్‌ ‌మహమ్మారికి ఎంతో మంది బలయ్యారని కన్నీళ్లు పెట్టుకున్నారు. నిన్నమొన్నటి వరకు మన చుట్టు పక్కనే ఉన్న చాలా మందిని కోవిడ్‌ ‌బలి తీసుకుంది.

వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. డాక్టర్లు, ఇతర మొదటి శ్రేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారని మోదీ అన్నారు.కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 కొరోనా కేసులు నమోదు కాగా, 4,209 మంది కొరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం 2 కోట్ల 60 లక్షల 31 వేలకు కొరోనా కేసులు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 30,27,925 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా, కొరోనాతో 2,91,331 మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా 14,82,754 మందికి వ్యాక్సిన్‌ ‌తీసుకున్నారని, భారతదేశంలో యాక్టివ్‌ ‌కేసులు 11.63 శాతం, మరణాల రేటు 1.12 శాతం ఉన్నట్లు శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ ‌బులిటెన్‌ ‌తెలిపారు

Leave a Reply