Take a fresh look at your lifestyle.

ఇక ఇంటికే డాక్టర్‌..ఉచితంగా మందులు

ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్ ‌ప్రారంభం
దేశానికి ఆదర్శం కాబోతుందని ఏపి సిఎం జగన్‌ ‌వెల్లడి

పల్నాడు, ఏప్రిల్‌ 6 : ఆం‌ధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్‌ ‌విధానం అమల్లోకి వొచ్చింది. పట్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి గురువారం ప్రారంభించారు.  అనంతరం బహిరంగ సభలో జగన్‌ ‌మాట్లాడుతూ.. పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది కూడదు. ప్రతీ ఒక్కరికీ భరోసా కల్పిస్తున్న పథకం ఇది. గ్రామాల్లో ఉచితంగా ఆధునిక వైద్యం అందించే పథకం. డాక్టర్ల కోసం ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదు..డాక్టర్లే  ఇంటి దగ్గరకు వస్తారని అన్నారు. మందులు కూడా ఉచితంగా అందించే..గొప్ప కాన్సెప్ట్.. ‌ఫ్యామిలీ డాక్టర్‌ ‌పథకం అన్నారు. పెన్షన్లు ఏవిధంగా  ఇంటికే వస్తున్నాయో అదే విధంగా డాక్టర్‌  ఇం‌టికొస్తాడు.

దేశం మొత్తం ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్‌ను కాపీ కొడతారు. ప్రతి ఒక్కరికి రక్షణ కవచంగా ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్ ‌నిలబడుతుంది. పేదవాడి ప్రాణాలు గాల్లో దీపం అన్న నానుడి మార్చిన ఘనత వైఎస్స్ ‌దే అని ఈసందర్భంగా తెలిపారు.. ఆరోగ్యశ్రీని పద్ధతి ప్రకారం నీరు గార్చారు. వెయ్యి జబ్బులకు మాత్రమే కట్టడి చేశారు.నెట్‌ ‌వర్కస్ ఆసుపత్రులకు రూ. 800 కోట్లు బకాయిలు పెట్టారు.ఈ ప్రభుత్వంలో రూ. 9000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. వైద్య ఆరోగ్య శాఖలో 48,639 ఉద్యోగాలిచ్చాం. గతానికి ప్రస్తుతానికి తేడా చూడండి. వందకి వంద శాతం ఖాళీలు భర్తీ చేశాం‘ అని సీఎం జగన్‌ ‌తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి విడదల రజని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాల్లో మంత్రులు ప్రారంభించారు.

Leave a Reply