Take a fresh look at your lifestyle.

వ్యవసాయ చట్టాలను నిలుపదల చేస్తారా..చేయమంటారా?

  • రైతులతో చర్చల్లో చిత్తశుద్ది కానరావడం లేదు
  • వ్యవసాయ చట్టాలపై ఫిర్యాదుల్లో ఒక్కటీ అనుకూలంగా లేదు
  • రైతుల ఆందోళనలో అపశృతులు కనిపిస్తున్నాయి
  • చట్టాల పరిశీలనకు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు
  • చీఫ్‌ ‌జస్టిస్‌ ‌బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్య
  • కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం షాక్‌
  • ఆం‌దోళన చేస్తున్న రైతులకు భారీ ఊరట

కొత్త వ్యవసాయ చట్టాలపై మొడిగా వాదిస్తున్న కేంద్రానికి సుప్రీంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. చట్టాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం దర్మాసనం సూచించింది. దీంతో వ్యవసాయ చట్టాల రద్దుకోసం సుదీర్ఘం ఉద్యమం చేస్తున్న రైతులు, రైతు సంఘాలకు భారీ ఊరట లభించినట్లు అయ్యింది. మూడు వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటీషన్‌పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతకాలం చట్టాల అమలును నిలిపి వేయాలని లేదంటే తామే స్టే విధిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెగేసి చెప్పింది. అలాగే ఈ చట్టాల పరిశీలనకు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే రైతులు తమ నిరసనను కొనసాగించుకో వచ్చని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది..ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మక సమస్యగా ఎందుకు చూస్తోందని ప్రశ్నించిన సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి శరద్‌ అరవింద్‌ ‌బాబ్డే వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా కేంద్ర వైఖరిపై అసంతృప్తితో ఉన్నామన్నారు. రైతుల ఆందోళన, సమస్యను పరిష్కరించడలంలో కేంద్రం సరిగా వ్యవహరించలేదని అభిప్రాయపడ్డారు. పలుదఫాలు చర్చలు విఫలంపై స్పందిస్తూ కేంద్రం పరిస్థితిని సరిగ్గా నిర్వహిస్తోందని, చర్చలు ప్రభావవంతంగా ఉన్నాయని తాము విశ్వసించడలేదంటూ ఘాటుగా స్పందించారు. అందుకే చట్టాల అమలును నిలిపివేయడం ద్వారా వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతు సంఘాలతో ప్రభుత్వ చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య సీజేఐ వ్యాఖ్యలు ప్రాధన్యతను సంతరించుకున్నాయి.కొంతమంది రైతులు ఆత్మహత్యలను ప్రస్తావించిన సుప్రీంకోర్టు, వీటిపై ఆందోళన వ్యక్తం చేసింది. వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతోందని కూడా ప్రశ్నించింది.

ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. ఇకపై ఎవరి రక్తంతోనూ మన చేతులు తడవకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు చట్టాల పరిశీనలకుగాను ఐసీఎఆర్‌తో సహా నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై వ్యతిరేక, అనుకూల వాదనలను ఈ కమిటీకి అందించుకోవచ్చని , కమిటీ నివేదిక మేరకు తాము వ్యవహరిస్తామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు కేవలం 2-3 రాష్ట్రాలు మాత్రమే నిరసన తెలుపుతున్నాయని అటార్నీ జనరల్‌ ‌మెహతా సుప్రీంకు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల రైతులు, ఇతర ప్రాంతాల రైతులు నిరసనల్లో పాల్గొనడం లేదన్నారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రోజురోజుకీ పోరాటాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు సోమవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. నూతన చట్టాలను వి•రు నిలుపుదల చేస్తారా? లేదంటే మమ్మల్ని చేయమంటారా? ఇందులో అహం ఎందుకు? ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. మా చేతులకు రక్తం అంటుకోవాలని మేం భావించడం లేదని తెలిపింది. ఆందోళనల్లో పాల్గొన్న కొంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలు, వృద్ధులు కూడా పాల్గొంటున్నారు. అసలు ఏం జరుగుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.చట్టాలను రద్దు చేయమని తాము అనడం లేదని, సమస్యకు పరిష్కారం కనుగొనడమే తమ లక్ష్యమని సుప్రీం స్పష్టం చేసింది. అయితే చట్టాల్ని కొంత కాలం నిలిపేయగలరా? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది.

రైతుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్‌ ‌చేయలేకపోయిందని, అందుకే తామే ఓ నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ ‌బోబ్డే స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాల అమలును వి•రు నిలిపేస్తారా లేక మమ్మల్ని ఆ పని చేయమంటారా అంటూ ప్రశ్నించింది.ఒక్క పిటిషన్‌ ‌కూడా ఈ చట్టాలు లబ్ది చేకూర్చుతాయని చెప్పలేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణలో భాగంగా చీఫ్‌ ‌జస్టిస్‌ ఆఫ్‌ ఇం‌డియా బోబ్డే కేంద్రం తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మేము ఏవో విచ్చలవిడి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు కానీ కేంద్ర ప్రభుత్వంపై చాలా అసంతృప్తిగా ఉంది. ఏం సంప్రదింపుల పక్రియ కొనసాగుతుందో మాకు తెలియదు. అసలు ఏం జరుగుతోందో దయచేసి చెబుతారా అంటూ బోబ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యకు స్నేహపూర్వక పరిష్కారం చూపాలన్నదే మా ఉద్దేశం. కానీ ఈ చట్టాల అమలు నిలిపివేతపై ఎందుకు మాట్లాడటం లేదు. ఒకవేళ కేంద్రం చట్టాల అమలు నిలిపివేస్తే రైతులను చర్చలకు రావాల్సిందిగా మేము చెబుతాం. వి•రైనా ఆ పని చేయండి లేదంటే కోర్టే చేస్తుంది అని బోబ్డే స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నో ఆత్మహత్యలు, మరణాలు సంభవించాయని, పిల్లలు, మహిళలను రక్షించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయ పడ్డారు. రైతులు ఆందోళన నిర్వహించే స్థలాన్ని మరో చోటికి మార్చాలని కోర్టు ప్రతిపాదించింది. అయితే చట్టాల అమలు నిలిపివేత మాత్రం కుదరదని అటార్నీ జనరల్‌ ‌కోర్టుకు స్పష్టం చేయడం గమనార్హం.

Leave a Reply