Take a fresh look at your lifestyle.

10 ‌జన్‌పథ్‌ ‌స్క్రిప్ట్‌ను కేసీఆర్‌ ‌చదువుతున్నారు

సర్జికల్‌ ‌స్ట్రైక్స్‌పై మసూద్‌ అజార్‌ ‌చెబితే నమ్ముతారా ?
సైనికులు వీరోచితంగా పోరాడుతుంటే సోయి లేకుండా మాట్లాడతారా ?
సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఫైర్‌

‌ప్రజాతంత్ర. హైదరాబాద్‌ :  ‌దేశ రక్షణ కోసం సైనికులు వీరోచితంగా పోరాడుతుంటే సీఎం కేసీఆర్‌ ‌సోయి లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ ఏ ‌దేశానికి వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడం లేదనీ, కేసీఆర్‌ ‌ప్రెస్‌ ‌మీట్‌ అం‌టే కామెడీ అయిపోయిందనీ, ఆయన మాటలకు అంతా నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ సైనికులు సర్జికల్‌ ‌స్రైక్స్ ‌చేస్తే రాహుల్‌ ‌గాంధీ, కేసీఆర్‌ ‌తప్ప అందరూ సంబరాలు చేసుకున్నారని విమర్శించారు. 10 జన్‌పథ్‌ ‌రాసిచ్చిన స్క్రిప్ట్‌ను కేసీఆర్‌ ‌చదువుతున్నారు సర్జికల్‌ ‌స్ట్రైక్స్‌పై మసూద్‌ అజార్‌ ‌చెప్తే నమ్ముతారా ? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు దేశంపై గౌరవం ఉంటే సైనికులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. సైనికులను కించపరచిన కేసీఆర్‌కు దేశంలో ఉండే అర్హత లేదనీ, ఆయన లాంటి మూర్ఖుడిని క్షమించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలను దేశం మొత్తం ఖండిస్తున్నట్లు చెప్పారు.

రాఫెల్‌ ‌డీల్‌పై సుప్రీం కోర్టు కూడా క్లీన్‌ ‌చిట్‌ ఇచ్చిందనీ, కేసీఆర్‌కు దేశ ప్రధాని, త్రివిధ దళాధిపతుల మీద కూడా నమ్మకం లేదని విమర్శించారు.సంచలనాల కోసమే కేసీఆర్‌ ‌దేశ ప్రధాని, సైనికుల మీద వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దేశంలో నంబర్‌ ‌వన్‌ అవినీతిపరుడు కేసీఆర్‌ అని స్పష్టం చేశారు. కొరోనా సమయంలో ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ ‌కింద రూ.20 లక్షల కోట్లను ప్యాకేజీ కింద ప్రకటించడం కేసీఆర్‌కు నచ్చ లేదనీ, లబ్దిదారులకు నేరుగా డబ్బులు ఇస్తుంటే కేసీఆర్‌ ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు.వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టొద్దని కేంద్ర గత నెలలోనే అన్ని రాష్ట్రాలకు గైడ్‌లైన్స్ ‌పంపించిందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలనీ, కేసీఆర్‌ ‌కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారనీ, దీనిని తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. కేసీఆర్‌ ఏ‌ప్రిల్‌ ‌నెలలో కరంటు చార్జీలు పెంచబోతున్నారనీ,  విద్యుత్‌ ‌బిల్లులు పెంచినా మోటార్ల దగ్గర మీటర్లు పెట్టినా కేసీఆర్‌కు మీటర్‌ ‌పెట్టడం గ్యారంటీ అని ఈ సండర్బంగా బండి సంజయ్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply