Take a fresh look at your lifestyle.

ప్రజా ప్రతినిధిలు ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్సలు చేయించుకోరా?

మహమ్మారి కొరోనా వైరస్‌ ‌సోకిన వారందరూ ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లోనే చికిత్స చేయించుకోవాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ఇటీవల ఆ వ్యాధి బారిన పడిన ప్రజా ప్రతినిధలు మాత్రం ప్రైవేటు హాస్పిటల్స్ ల్లో చికిత్స చేయించుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత నాయకులకు ప్రభుత్వం హాస్పిటల్స్ అందిస్తున్న చికిత్సలపై నమ్మకంలేదన్న విషయం దీనివల్ల స్పష్టంగా అర్థమవుతున్నదంటు న్నారు. ప్రజాప్రతినిధులకే నమ్మకంలేని ఈ హాస్పిటల్స్ ల్లో సామాన్యప్రజలకు సేవల పేరున అందిస్తున్న చికిత్సలన్నీ కంటి తుడుపులేనా అన్న అనుమానాలిప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర హోంశాఖమంత్రి మహమూద్‌ అలీ, డిప్యూటీ స్పీకర్‌ ‌పద్మారావులు కొరోనా వైరస్‌ ‌కారణంగా అపోలో లో చేరి చికిత్స చేయించుకున్నారు. అంతకు ముందు జనగామ ఎంఎల్‌ఏ ‌ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌ ‌జిల్లాకు చెందిన ఇద్దరు ఎంఎల్‌ఏలు బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, బీగాల గణేష్‌గుప్తలు కూడా కార్పోరేట్‌ ‌వైద్యం చేయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. విఐపిలకు ఒక విధంగా, సామాన్య ప్రజలకు మరో విదంగా చికిత్సను అందజేయడమేంటని ప్రతిపక్షాలుకూడా గగ్దోలు పెడుతున్నాయి. ప్రభుత్వం దృష్టిలో సామాన్య ప్రజల ప్రాణాలకు విలువలేట్లు కనిపిస్తున్నదంటూ వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్సచేయించుకున్న విషయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్‌ ఇచ్చిన వివరణ పైన కూడా వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరుపై వెలుగుచూస్తున్న సంఘటనల నేపద్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్ళాలంటేనే ప్రజలు భయపడి పోతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో నేనురాను బిడ్డో ప్రభుత్వ దవాఖానాకు అన్న విధానంనుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత వాటి తలరాతలు మారినట్లు కనిపించాయి. అయితే కొరోనా నేపథ్యంలో ఇప్పుడు ఈ హాస్పిటల్స్ పనితీరు పూర్వంకన్నా మరింత అద్వాన్నంగా తయారైందంటున్నారు. ఏ హాస్పిటల్స్ కి వెళ్ళినా కనీసంగా పట్టించుకున్నవారే ఉండటం లేదని ప్రత్యక్షసాక్షులు వీడియోల ద్వారా తమకు జరిగిన అన్యాయాలను ఏకరుపెడుతున్న దృష్యాలు సోషల్‌ ‌మీడియాలో హల్‌చెల్‌ ‌చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ హాస్పిటల్స్ లంటేనే ప్రజల్లో వణుకు పుట్టుకొస్తున్నది.

రాష్ట్రంలో కొరోనా కేసులు వెలుగు చూస్తున్న మొదట్లో ప్రభుత్వ పరంగానే చికిత్సలు అందిస్తామన్న ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటల్స్ కొరోనా పేషంట్స్‌ను తీసుకోకుండా కట్టడిచేసింది. వైరస్‌ ‌ప్రభావం తక్కువ ఉండడంతో ఇతర పేషంట్స్‌తోపాటు కొరోనా పేషంట్స్‌కు చికిత్స చేయడానికి గాంధీ దవాఖానను అనువైనదిగా భావించారు. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో గాంధీని పూర్తిగా కొరోనా బాదితులకోసమే కేటాయించారు. అలాగే కొరోనా లక్షణాలున్నవారికి కోఠి హాస్పిటల్స్ లో సేవలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏకాస్తా అనుమానం ఉన్నవారు కూడా అక్కడికి క్యూకట్టడం ప్రారంభించారు. అక్కడ రద్దీ పెరగడంతో సీరియస్‌గా ఉన్నవారినే తీసుకోవడం ప్రారంభించారు. ఆతర్వాత వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్ చికిత్సలు ప్రారంభించారు. మొత్తానికి గాంధీ, ఉస్మానియా, కోఠి, చెస్ట్ ఆసుపత్రులన్నీ పేషంట్స్‌తో కిటకిటలాడటం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఇతర జబ్బులతో వెళ్ళేవారిని పట్టించుకోవడం మానివేశారు. కొరోనా అని నిర్దారణ కాకున్నా, కొరోనా అన్న అనుమానంతో ఈఆసుపత్రులన్నీ కేసును తీసుకోకుండా మరో ఆసుపత్రికి పంపించడం లేదా కరోనా పరీక్ష వివరాలు ‌వచ్చిన తర్వాతే ట్రీట్‌మెంట్‌ ‌ప్రారంభిస్తామని వారిని పక్కకు పెడుతుండడంతో కొందరు హాస్పిటల్స్ చుట్టు తిరుగుతూనే ప్రాణాలు వదిలితే, ఇంకొందరు వైరస్‌ ‌పరీక్ష రిజల్ట్స్ ‌రాకముందే ప్రాణాలు పొగొట్టుకున్నవారున్నారు. ఏ హాస్పిటల్స్ కైనా ఎంతో అవసరమైతేనే చికిత్సకోసం వస్తారు. కాని ఇటీవల ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ఎంత నిర్ధయగా వ్యవహరిస్తున్నాయనడానికి బాదితులు తమ సెల్ఫీలద్వారా వారికి జరిగిన అన్యాయాన్ని వివరించిన తీరు ఎంతటివారినైనా కలిచి వేసేవిగా ఉన్నాయి. ఇటీవల శ్రీకాంత్‌ అనే వ్యక్తి తన భార్యకు జ్వరంవచ్చి, సరిగాశ్వాస తీసుకోలేకపోతున్నదంటూ ప్రభుత్వ, ప్రేవేటు హాస్పిటల్స్ లన్నీ కలిపి మొత్తం పన్నెండు హాస్పిటల్స్ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదట. ఏ హాస్పిటల్స్ వెళ్ళినా తమవద్ద బెడ్స్‌లేవనో, వెంటీలేటర్స్‌లేవనో, ఆక్సిజన్ ‌లేదనో వంకచెప్పి మరో హాస్పిటల్స్ పంపిస్తుంటే, రాత్రంతా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ అక్కడక్కడ తానే స్వయంగా, బలవంతంగా ఆయా హాస్పిటల్స్ ల్లో పావుగంటో, అరగంటో ఆక్సిజన్‌ ‌పెట్టుకుంటూ ఎలాగైనా భార్యను బతికించుకోవాలని ఎంత కష్టాపడ్డాడో ఆవీడియో చూస్తే అర్థమవుతుంది. ఆలాగే ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే చికిత్స పొందుతున్న మరో పేషంట్‌ ‌మూడు గంటలుగా తానెంత బతిమిలాడినా ఆక్సిజన్‌లేకుండా చేశారని, ఎవరూ పట్టించుకోవడంలేదని, ఇకతాను బతకనని తన తండ్రికి బై డాడీ, బై డాడీ అంటూ సెల్ఫీచేసి పెట్టిన కొద్దిసేపటికే మరణించాడట. దీన్ని హాస్పిటల్స్ వర్గాలు, ఆరోగ్యశాఖ మంత్రి కొట్టిపారేస్తున్నా తన కుమారిడి కోసం దాదాపు పది ఎ హాస్పిటల్స్ తిరుగాల్సివచ్చిందంటూ ఆ తండ్రి చెప్పిన మాటలు పలువురిని కంట తడిపెట్టించాయి. పేషంట్‌ల పట్ల హాస్పిటల్స్ వర్గాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనడానికి తన తమ్ముడు, వీడియో జర్నలిస్టు ఎలా మృతిచెందింది ఆయన సోదరుడు తన సెల్ఫీలో వివరించినతీరు అందరికీ తెలిసిందే. వాళ్ళు వీడియోలద్వారా వివరించారు కాబట్టి తెలుస్తోంది. కాని, వెలుగులోకి రాకుండా ఇంతటి అవస్థలతో ప్రాణాలు కోల్పోతున్న సామాన్య బతుకులెన్నో… ఇప్పటికైనా ప్రభుత్వ, ప్రేవేటు హాస్పిటల్స్ పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం అంకుశంలా వ్యవహరిస్తే తప్ప కనీసం ఈ మహమ్మారిబారినపడిన సామాన్యుల ప్రాణాలు కాపాడినవారవుతారు లేదా సామాన్యులకు కూడా కార్పోరేట్‌ హాస్పిటల్స్ లో చికిత్స చేయించాలన్నది ప్రజల డిమాండ్‌.

Leave a Reply

error: Content is protected !!