Take a fresh look at your lifestyle.

అసత్యానికి, అన్యాయానికి తలొగ్గను ఎవరకీ భయపడేది లేదంటూ రాహుల్‌ ‌ట్వీట్‌

ఈ ‌ప్రపంచంలో తాను ఎవరికీ భయపడనని గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంపీ రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ ‌చేస్తూ ఈ విషయాన్ని ఉటంకించారు. ‘నేను ప్రపంచంలో ఎవరికీ భయపడను. ఎలాంటి అన్యాయానికి తలొగ్గను. సత్యానికి ఉన్న శక్తితో అబద్ధాలను ఓడిస్తాను. అసత్యానికి వ్యతిరేకంగా పోరాడే సమయంలో ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ ఎదుర్కొంటాను.’ అంటూ జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ రాహుల్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.

హత్రాస్‌ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌, ‌ప్రియాంక గాంధీలను యూపీ పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై గురువారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అలహాబాద్‌ ‌హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్‌ ‌హత్రాస్‌ ‌ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపేందుకు నిర్ణయించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply