Take a fresh look at your lifestyle.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించొద్దు

బంద్‌ ‌జయప్రదం చేయాలంటూ పోస్టర్‌ ‌విడుదల
‌విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించొద్దని, ఈనెల 5న జరిగే రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి జి.దేముడు నాయుడు మాట్లాడుతూ 32 మంది ప్రాణాలు బలిదానంతో వేలాది మంది రైతులు 22 వేల ఎకరాల భూములు త్యాగ ఫలితంగా విశాఖ స్టీల్ ‌ఎ•-లాంట్‌ ఏర్పడిందని, అటువంటి విశాఖ ఉక్కును కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం అంటే దేశ ద్రోహం కాక ఇంకేమనాలని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మనసు మార్చుకొని విశాఖ స్టీల్‌ ఎ•-‌లాంట్‌ ‌కు సొంత నిధులు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 5న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు డివైఎఫ్‌ఐ ‌మత్స్య కార్మిక సంఘం నాయకులు అయినా రామకఅష్ణ, శివాజీ, గంగరాజు, పవన్‌ ‌కుమార్‌, ‌గోవిందు, తాతారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply