
ములుగు: రానున్న మేడా రం జాతరలో భక్తుల సౌకార్యార్ధం చేపడుతున్న అభివృద్ది పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు ఉన్నా శాఖా పరంగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఇంచార్జీ కలెక్టర్ వాసం వెంకటేశ్వ ర్లు అన్నారు. గురువారం కలెక్టర్ మేడారంలోని ఊరట్టం నుండి కన్నేపల్లి వరక నిర్మించిన రోడ్డు పనులను పరిశీలించారు. గతంలో సీసీ రోడ్డు ఉండగా ప్రస్తుతం వేసిన బిటి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. వేసిన రోడ్డుపై గడ్డి మొలవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు.పనుల పర్యవేక్షణ చేపట్టని పంచాయితీ రాజ్ ఏఇ కె.రమేష్‌ను సస్పెండ్ చేయాలని, ఇఇ రాంబాబు, డిఇ రవీందర్‌లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
నాణ్యత లోపం తో పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపి వేయా లని, ఇప్పటికే బిల్లులు చెల్లించినచో రికవరీ చేయాలని ఆదేశించారు. మేడారంలో చేపడుతున్న పనుల పర్య వేక్షణను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల న్నారు. మేడారం పనుల నాణ్యత పరిశీలనకు శాఖా పర క్వాలిటీ తనిఖీ విభాగంతో పాటు, విజిలెన్స్ విభా గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.రమాదేవి, పిఅర్ ఇఇ రాంబాబు,డిపివో వెంకయ్య తదితరులు పాల్గోన్నారు.
Tags: road quality, overlook quality, deficiencies, mulugu Collector, medaram festival